కోవన్ కస్టడీ విచారణను తప్పుపట్టిన హైకోర్టు | madras high court slams custody interrogation of kovan | Sakshi
Sakshi News home page

కోవన్ కస్టడీ విచారణను తప్పుపట్టిన హైకోర్టు

Published Sat, Nov 7 2015 6:58 PM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM

కోవన్ కస్టడీ విచారణను తప్పుపట్టిన హైకోర్టు - Sakshi

కోవన్ కస్టడీ విచారణను తప్పుపట్టిన హైకోర్టు

చెన్నై: తమిళ గాయకుడు కోవన్కు హైకోర్టులో ఉపశమనం లభించింది. కోవన్కు దిగువ కోర్టు విధించిన కస్టడీ విచారణపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. ఈ కేసులో దిగువ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టింది.

తమిళనాట మద్యనిషేధ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న మక్కల్ కలై ఇలక్కియ కళగం సంస్థకు చెందిన కోవన్.. ఆ రాష్ట్ర సీఎం జయలలితకు వ్యతిరేకంగా పాటలు రాసి ఇంటర్నెట్‌లో అప్‌లోడ్ చేసినందుకు ఆయన్ను రాజద్రోహం కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఎగ్మోర్ మెజిస్ట్రేటు నవంబర్ 6 వరకు కోవన్ను కస్టడీకి ఆదేశించారు. దీనిపై తమిళనాడులో నిరసనలు వ్యక్తమయ్యాయి. హైకోర్టును ఆశ్రయించడంతో కోవన్కు ఊరట దక్కింది.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement