న్యూ లుక్లో టాలీవుడ్ ప్రిన్స్ | Mahesh Babu plays intelligence officer in his next | Sakshi
Sakshi News home page

న్యూ లుక్లో టాలీవుడ్ ప్రిన్స్

Published Mon, Sep 12 2016 1:18 PM | Last Updated on Wed, Aug 15 2018 7:18 PM

న్యూ లుక్లో టాలీవుడ్ ప్రిన్స్ - Sakshi

న్యూ లుక్లో టాలీవుడ్ ప్రిన్స్

చెన్నై : టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు న్యూ లుక్లో ఫ్యాన్స్ను అలరించబోతున్నారట. పోకిరి, దూకుడు వంటి సినిమాల్లో పోలీసు గెటప్తో ప్రేక్షకులను అలరించిన మహేష్ ఏఆర్. మురుగదాస్ దర్శకత్వం వహిస్తున్న తమిళ-తెలుగు ద్విభాషా ప్రాజెక్టులో నటించనున్నారట. అయితే ఈ ప్రాజెక్టులో అలాంటి ఇలాంటి రెగ్యులర్ పోలీస్గా కాకుండా ఇంటిలిజెన్స్ ఆఫీసర్గా మహేష్ కనిపించనున్నారట. ప్రస్తుతం ఈ షూటింగ్లో మహేష్ బిజీగా ఉన్నాడని తెలుస్తోంది.
 
ఈ సినిమాలో మహేష్ చాలా స్టైలిష్గా కనిపిస్తాడని, ఇప్పటికే పోలీసు గెటప్తో ప్రేక్షకులకు సుపరిచితమైన మహేష్ను విభిన్న అవతారంలో మురుగదాస్ చిత్రీకరించబోతున్నారని చిత్ర యూనిట్ పేర్కొంటోంది.  అయితే మురుగదాస్, మహేష్ కాంబినేషన్లో వస్తున్న మొదటి ఫిల్మ్ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం చెన్నైలోని ఈవీపీ వరల్డ్ పార్క్లో ఈ ప్రాజెక్టు షూటింగ్ జరుగుతోందని చిత్ర యూనిట్ వెల్లడిస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు టైటిల్ను మాత్రం ఇంకా నిర్ణయించలేదు. ఈ సినిమాలో రకుల్ ప్రీతీ సింగ్, ఎస్.జే సూర్య నటిస్తున్నారని తెలుస్తోంది.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement