జైపూర్: రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ కుదేలయింది. ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా హస్తం పార్టీ అడ్రస్ గల్లంతయింది. మధ్యాహ్నం రెండు 2 గంటలకు ప్రకటించిన ఫలితాలను చూస్తే కాంగ్రెస్ పార్టీకి కనీసం విపక్ష హోదా అవకాశాలు కూడా లేవని స్పష్టమవుతోంది.12 స్థానాల్లో జిల్లాల్లో కాంగ్రెస్ ఖాతా తెరవకలేకపోయింది.
జైపూర్ నగరంలోని 19 స్థానాల్లో 10 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు కాంగ్రెస్ పరిస్థితి ఎంత దీనంగా ఉందో. జ్యోతిరాదిత్య సింధియా యువ మంత్రం రాజస్థాన్లో పనిచేయలేదు. బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధరా రాజే తన సొంత నియోజకవర్గంలో విజయబావుటా ఎగుర వేశారు. సర్దార్పూరలో ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ గెలుపు బాటలో పయనిస్తున్నారు.
రాజస్థాన్లో హస్తం పార్టీ అడ్రస్ గల్లంతు
Published Sun, Dec 8 2013 3:02 PM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
Advertisement
Advertisement