తినదు.. తాగుతుంది.. | Manju Dharra can't eat, drinks five litres of milk a day | Sakshi
Sakshi News home page

తినదు.. తాగుతుంది..

Published Thu, Feb 13 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 3:38 AM

తినదు.. తాగుతుంది..

తినదు.. తాగుతుంది..

ఈ అమ్మాయి పేరు మంజు ధారా(25). హర్యానాలోని సోనిపట్‌లో ఉంటోంది. మంజు పాలు తాగుతుంది.. టీ తాగుతుంది.. నీళ్లు తాగుతుంది.. జ్యూస్ కూడా తాగుతుంది..

ఈ అమ్మాయి పేరు మంజు ధారా(25). హర్యానాలోని సోనిపట్‌లో ఉంటోంది. మంజు పాలు తాగుతుంది.. టీ తాగుతుంది.. నీళ్లు తాగుతుంది.. జ్యూస్ కూడా తాగుతుంది.. కానీ ఏమీ తినదు! అవును.. మంజు గత 25 ఏళ్లుగా ఏమీ తినలేదు.. తాగింది అంతే.. అందుకే ఆహారం చూడగానే.. ముఖమిలా పెట్టింది. ఎందుకంటే.. ఆమె అక లాజియా అనే సమస్యతో బాధపడుతోంది. దీని వల్ల ఆమె ఏదైనా తినాలనుకున్నా.. వెంటనే వాంతి అయిపోతుంది. పైగా.. తీవ్రమైన కడుపు నొప్పి వస్తుంది. మనం ఏదైనా ఘనపదార్థాన్ని తిన్నప్పుడు అన్నవాహిక దాన్ని కడుపులోకి తీసుకెళ్తుంది.
 
  కానీ మంజు అన్నవాహికకు ఆ సామర్థ్యం లేదు. పైగా.. అన్నవాహిక చివరి భాగం పూర్తిగా తెరుచుకుని లేదు. ఆపరేషన్ ద్వారా దీన్ని సరిదిద్దే అవకాశమున్నా.. ఆమె తల్లిదండ్రులు పేదవారు కావడం వల్ల శస్త్రచికిత్స చేయించే పరిస్థితిలో లేరు. దీంతో వారి వద్ద ఉన్న కొద్దిపాటి సొమ్ముతో మంజు తాగే పాల కోసం ఓ ఆవును కొన్నారు. ఆమె రోజూ 4 నుంచి 5 లీటర్ల పాలు తాగుతుంది. అప్పుడప్పుడు టీ, జ్యూస్ వంటివి తీసుకుంటుంది. ఇన్నేళ్లు ఘనపదార్థాలు తీసుకోకున్నా.. ఆమె ఆరోగ్యంగానే ఉండటం విశేషం. పైగా.. ఇంట్లోని పనులన్నీ ఆమే చేస్తుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement