బోస్టన్: మహిళలు వేసుకునే దుస్తులపై ఆంక్షలు విధించే దేశాల గురించి ఇప్పటిదాకా మనం చాలానే విన్నాం...డ్రెస్ కోడ్ అంటూ స్త్రీలు ఎలాంటి దుస్తులు ధరించాలో ఆదేశించే ఫత్వాలకైతే లెక్కేలేదు.. అయితే అమెరికాలోని మసాచుసెట్స్ రాష్ట్రం హైకోర్టు వీటన్నింటికంటే భిన్నంగా ఓ తీర్పునిచ్చింది. మసాచుసెట్స్‌లో మహిళలు స్కర్ట్స్ వేసుకున్నప్పుడు ఎవరైనా ఫొటో తీస్తే అదేం నేరం కాదు అని పేర్కొంది. అలాంటి ఫొటోలు తీయడం తమ రాష్ట్రన్యాయసూత్రాల ప్రకారం న్యాయసమ్మతమే అని తీర్పునిచ్చింది. 2011 డిసెంబర్‌లో మైకెల్ రాబర్డ్‌సన్ అనే వ్యక్తి బోస్టన్‌లో స్కర్ట్ వేసుకున్న మహిళను ఫొటో తీశాడనే కారణంతో పోలీసులు అరెస్టు చేశారు.
దీనిపై విచారణలో భాగంగా అక్కడి హైకోర్టు ఇటీవల ఈ తీర్పు నిచ్చింది. అయితే కోర్టు తీర్పుపై మసాచుసెట్స్ స్పీకర్ రాబర్ట్ డీలియో స్పందిస్తూ.... తమ రాష్ట్ర న్యాయశాస్త్రంలోని లొసుగుల ఆధారంగా ఈ తీర్పు వచ్చిందని పేర్కొన్నారు. రాష్ట్ర న్యాయసూత్రాలను సవరిస్తామని తెలిపారు.