రాష్ట్రపతి పాలన విధించాలి: మాయవతి | Mayawati seeks President's rule in Uttar Pradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్రపతి పాలన విధించాలి: మాయవతి

Published Wed, Nov 5 2014 4:35 PM | Last Updated on Sat, Sep 2 2017 3:55 PM

రాష్ట్రపతి పాలన విధించాలి: మాయవతి

రాష్ట్రపతి పాలన విధించాలి: మాయవతి

ఉత్తర ప్రదేశ్లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధ్యక్షురాలు మాయవతి బుధవారం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పి దుర్భరమైన పరిస్థితి నెలకొందని చెప్పారు. ఆమె బుధవారమిక్కడ విలేకరులతో మాట్లాడారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్రంలో పునర్వవైభవాన్ని తీసుకరావాలని కోరుకుంటున్నట్టు మాయవతి పునరుద్ఘాటించారు.

ప్రస్తుతం రాష్ట్రంలో అంతా అరాచకం రాజ్యమేలుతుందని ఆరోపించారు. శాంతిభద్రతలు అదుపులోకి రావాలంటే వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. దీనిపై గవర్నర్ సరైన నివేదికను పంపి, ఆపై రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నట్టు మాయవతి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement