
'రెండేసి నెలలు సెలవు తీసుకోలేదు'
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శలపై కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా మండిపడ్డారు. గడిచిన పదేళ్లలో యూపీఏ పరిపాలనా కాలంలో కాంగ్రెస్ పార్టీ దేశం మొత్తాన్ని ఎక్కడపడితే అక్కడ దోచుకు తిందని విమర్శించారు. మన ప్రధానమంత్రి ఎప్పుడైనా విదేశీ పర్యటనలకు వెళ్లారంటే, భారతదేశ పరువు ప్రతిష్ఠలను అక్కడ ఇనుమడింపజేసి వస్తున్నారని ఆయన చెప్పారు. అంతేతప్ప రెండేసి నెలలు సెలవు తీసుకుని ఎప్పుడూ వెళ్లలేదంటూ పరోక్షంగా రాహుల్ గాంధీ సెలవును ప్రస్తావించారు.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ కావడంపై రాహుల్ గాంధీ విమర్శలు సంధించిన నేపథ్యంలో రాజ్నాథ్ తీవ్రంగా స్పందించారు.