
బంగారంలాంటి భూములు లాక్కునేందుకే...
న్యూఢిల్లీ: బంగారంలాంటి పంటలు లాక్కోవాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు. ఆదివారం రైతులకోసం ఢిల్లీలోని రాంలీలా మైదానంలో ఏర్పాటు చేసిన కిసాన్ ర్యాలీలో పాల్గొన్న సోనియా మాట్లాడుతూ బడ్జెట్లో రైతుల సంక్షేమానికి కేటాయింపులు తగ్గాయని చెప్పారు. ఓ పథకం ప్రకారమే మోదీ సర్కార్ భూ సేకరణ చట్టంలో మార్పులు తెస్తున్నారని, రైతుల భూములు లాక్కోవాలన్నదే బీజేపీ మోదీ ప్లాన్ అని ఆరోపించారు.
కార్పొరేట్ సంస్థలకు మేలు చేయాలన్నదే మోదీ ప్రధాని ఉద్దేశమనిఆమె చెప్పారు. 14 పార్టీలతో కలిసి తాము ఈ విషయంలో రాష్ట్రపతిని కలిశామని చెప్పారు. మోదీ చెప్పే మాట ఒకటి.. మనసులో ఉన్నది మరొకటి అని తెలిపారు. కిసాన్ ర్యాలీతో రైతుల ఆగ్రహాన్ని మోదీ దృష్టికి తీసుకొచ్చామని సోనియా వివరించారు.