ఒబామాకు స్వయంగా టీ కలిపిచ్చిన మోదీ | modi prepares tea for obama at hyderabad house | Sakshi
Sakshi News home page

ఒబామాకు స్వయంగా టీ కలిపిచ్చిన మోదీ

Published Sun, Jan 25 2015 3:14 PM | Last Updated on Fri, Aug 24 2018 1:52 PM

ఒబామాకు స్వయంగా టీ కలిపిచ్చిన మోదీ - Sakshi

ఒబామాకు స్వయంగా టీ కలిపిచ్చిన మోదీ

న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ప్రధాని నరేంద్ర మోదీ అవాజ్యమైన అభిమానం కురింపించారు. భారత గడ్డపై అడుగుపెట్టిన ఒబామాకు స్వయంగా స్వాగతం పలికిన మోదీ తర్వాత కూడా అదేరకమైన అభిమానం చూపించారు.

హైదరాబాద్ హౌజ్ లో ఒబామాతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మోదీ ఆయనతో కలిసి 'వాక్ అండ్ టాక్'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒబామాకు స్వయంగా టీ కలిపి ఇవ్వడం విశేషం. టీ కప్పును స్వహస్తాలతో ఒబామాకు అందించారు. పూర్వాశ్రమంలో మోదీ.. ఛాయ్ వాలా అన్న సంగతి జగద్విదితం. టీ తాగుతూ ఇరువురు అగ్రనేతలు చర్చల్లో మునిగితేలారు.

ఈ సందర్భంగా మోదీ చాలా ఉల్లాసంగా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. తాను చెప్పాల్సిన విషయాలను ఒబామాకు సూటిగా చెప్పినట్టు తెలుస్తోంది. మోదీ ఆత్మీయ అతిథ్యానికి అగ్రరాజ్యాధినేత ముగ్దులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement