Hyderabad House
-
‘హైదరాబాద్ హౌస్’ యజమాని ఎవరు? డబ్బును నీళ్లలా ఎందుకు ఖర్చు చేశారు?
జీ-20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా ఢిల్లీలోని ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్ కలుసుకున్నారు. 95 ఏళ్ల చరిత్ర కలిగిన ‘హైదరాబాద్ హౌస్’లో ప్రధాని మోదీని యువరాజు కలుసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇంతకీ ఢిల్లీలో హైదరాబాద్ హౌస్‌ను ఎవరు నిర్మించారో తెలుసా? సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు స్వాతంత్య్రానికి ముందు భారతదేశంలో సుమారు 560 సంస్థానాలు ఉండేవి. ప్రతి సంస్థానానికి వాటి రాజులు, రాచరిక రాష్ట్రాలు, నవాబులు, నిజాంలు ఉండేవారు. నాటి రోజుల్లో స్థానికుల సమస్యలను వినేందుకు, వారితో సమన్వయం కోసం బ్రిటిష్ ప్రభుత్వం 1920లో 'ది ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్'ను ప్రారంభించింది. ఈ ఛాంబర్ సమావేశాలు ఢిల్లీలో జరుగుతుండేవి. దీంతో బ్రిటీష్ ప్రభుత్వం ఎప్పుడు పిలిచినా సంస్థానాధీశులు ఢిల్లీకి పరుగులు తీయాల్సి వచ్చేది. అయితే వారికి తగినట్లు అక్కడ సరైన ఏర్పాట్లు ఉండేవి కాదు. ఎకరా భూమి రూ.5000 చొప్పున కొనుగోలు ఆ సమయంలో మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ సంస్థానానికి నిజాంగా ఉండేవాడు. ఆయన ఢిల్లీలో తన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపధ్యంలో భూమి కోసం అన్వేషణ ప్రారంభించారు. వైస్రాయ్ హౌస్ (ప్రస్తుతం రాష్ట్రపతి భవన్) సమీపంలోని 8.2 ఎకరాల స్థలాన్ని నిజాం కొనుగోలు చేశారు. అయితే ఆ భూమి కొద్దిగా తక్కువగా ఉందని భావించి, దానికి ఆనుకునివున్న ఓ భవనాన్ని కూడా కొనుగోలు చేశారు. అప్పట్లో నిజాం ఈ భూమిని ఎకరా రూ.5000 చొప్పున కొనుగోలు చేశారు. ‘వైస్రాయ్ హౌస్’ను పోలివుండేలా.. భూమిని కొనుగోలు చేసిన తర్వాత భవన నిర్మాణ మ్యాప్ తయారు చేయాల్సిన అవసరం ఏర్పడింది. దీని బాధ్యతను నిజాం.. నాటి ప్రముఖ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటియన్స్‌కు అప్పగించారు. లుటియన్స్ ‘హైదరాబాద్ హౌస్’ కోసం ‘సీతాకోకచిలుక’ ఆకారంలో డిజైన్‌ను సిద్ధం చేశారు, ఇది దాదాపు ‘వైస్రాయ్ హౌస్’ను పోలి ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో దేశంలోనే అత్యంత ధనవంతుడైన నిజాం ‘హైదరాబాద్ హౌస్’కు తొలుత రూ.26 లక్షలు ఖర్చు చేయాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత ఈ మొత్తాన్ని రూ.50 లక్షలకు పెంచారు. ఆ రోజుల్లో బర్మా (ప్రస్తుతం మయన్మార్)కు చెందిన టేకు చెక్క నాణ్యమైనదిగా గుర్తింపు పొందింది. నిజాం ఈ భవన నిర్మాణానికి అవసరమైన కలపను అక్కడి నుంచి ఆర్డర్ చేశాడు. ఎలక్ట్రికల్ ఫిట్టింగ్‌లు,ఇతర వస్తువులు న్యూయార్క్ నుండి ఆర్డర్ చేశారు. ఇంటీరియర్ డెకరేషన్‌కు విదేశాల నుంచి ఆర్డర్లు ఆ రోజుల్లో, లండన్‌లోని హాంప్టన్ అండ్ సన్స్ లిమిటెడ్, వారింగ్ అండ్ గిల్లో లిమిటెడ్ ఇంటీరియర్ డిజైనింగ్‌లో ప్రసిద్ధి చెందిన సంస్థలు. నిజాం ఈ రెండు కంపెనీలకు ‘హైదరాబాద్ హౌస్’ను అలంకరించే బాధ్యతను అప్పగించారు. అలంకారానికి లోటు రాకుండా ఉండేందుకు 1921లో ప్రపంచంలోని ప్రముఖ చిత్రకారులందరి నుంచి దాదాపు 17 పెయింటింగ్స్‌కు ఆర్డర్ ఇచ్చారు. అప్పట్లో ఈ పెయింటిగ్స్ ధర రూ.10,000 నుండి 20,000 వరకు ఉండేది. లాహోర్‌కు చెందిన ప్రముఖ చిత్రకారుడు అబ్దుల్ రెహ్మాన్ చుగ్తాయ్ తీర్చిదిద్దిన 30 పెయింటింగ్‌లను కూడా ఆర్డర్ చేశారు. వాటి విలువ రూ. 12,000. 'హైదరాబాద్ హౌస్' కోసం కార్పెట్లను ఇరాక్, టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ నుండి తెప్పించారు. నిజాం హోదాకు తగినవిధంగా ఉండేలా ఒకేసారి 500 మంది అతిథులకు భోజన ఏర్పాట్లు చేసేందుకు వీలుగా వెండి ప్లేట్లు, కత్తులు, ఇతర వస్తువులను ఆర్డర్ చేశారు. భవనాన్ని చూసిన నిజాం ఏమన్నారు? 1928 నాటికి ‘హైదరాబాద్ హౌస్’ పూర్తయింది. యూరోపియన్, మొఘల్ శైలిలో నిర్మితమైన ఈ భవనంలో మొత్తం 36 గదులు ఉన్నాయి. అందులో నాలుగు గదులు ‘జనానా’ అంటే మహిళలకు సంబంధించినవి. దాదాపు 10 ఏళ్లకు పూర్తయిన ఈ ‘హైదరాబాద్ హౌస్’లోకి అడుగుపెట్టినప్పుడు నిజాం ఎంతో బాధపడ్డారుట. నిజాంకు ఈ ‘హైదరాబాద్ హౌస్’ అస్సలు నచ్చక దానిని ‘గుర్రపుశాల’తో పోల్చారు. రూ. 50 లక్షలు ఖర్చు చేసినప్పటికీ ‘హైదరాబాద్ హౌస్’ అనేది కొన్ని చౌక భవనాల కాపీ మాత్రమే అని నిజాం పేర్కొన్నారట. ‘హైదరాబాద్ హౌస్’ ఇప్పుడు ఎవరిది? స్వాతంత్ర్యం సిద్ధించాక సంస్థానాలు భారతదేశంలో విలీనమయ్యాయి. 1954లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ‘హైదరాబాద్ హౌస్’ని లీజుకు తీసుకుంది. ఇందుకు ప్రతిగా 1970ల వరకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి డబ్బు చెల్లిస్తూ వచ్చింది. అనంతరం కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యాక కేంద్రం, రాష్ట్ర మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రరాష్ట్ర ప్రభుత్వానికి 7.56 ఎకరాల భూమిని ఇచ్చింది. దీంతో ‘హైదరాబాద్ హౌస్’ కేంద్రానికి సొంతమయ్యింది. ఇప్పుడు విదేశాంగ మంత్రిత్వ శాఖ హైదరాబాద్ హౌస్‌ను పర్యవేక్షిస్తోంది. -
G20 Summit: అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో భాగంగా దేశ రాజధానికి విచ్చేసిన సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్అజీజ్ అల్–సౌద్‌తో సోమవారం ప్రధాని మోదీ విస్తృతస్థాయి ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఉదయం ఆయనకు రాష్ట్రపతిభవన్‌లో రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు సాదర స్వాగతం పలికారు. తర్వాత ఢిల్లీలోని హైదరాబాద్ హౌజ్‌లో సల్మాన్ బిన్, మోదీ ద్వైపాక్షిక చర్చల తర్వాత మోదీ మాట్లాడారు. ‘ ఈ ప్రాంతంతోపాటు ప్రపంచ సుస్థిరతకు, సంక్షేమానికి భారత్–సౌదీ అరేబియా వ్యూహాత్మక భాగస్వామ్యం ఎంతో కీలకం. భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగిస్తున్న దేశాల్లో సౌదీ అరేబియా కూడా ఒకటి. రెండు దేశాలు కాలానుగుణంగా సత్సంబంధాలను సుదృఢం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి’ అని మోదీ అన్నారు. సోమవారం ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలి తొలి భేటీలో ద్వైపాక్షిక బంధంపై ఇద్దరు అగ్రనేతలూ సమీక్ష జరిపారు. రక్షణ, ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ప్రజారోగ్యం, ఆహార భద్రత, సంస్కృతి, సంక్షేమం తదితర అంశాలు మండలి తొలి భేటీలో చర్చకొచ్చాయని విదేశాంగ శాఖ కార్యదర్శి అరీందర్ బాగ్చీ ‘ఎక్స్’లో ట్వీట్‌చేశారు. ‘దేశాల దగ్గరి బంధాన్ని మరింత ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు అనువైన కొన్ని మార్గాలను అన్వేషించాం. ఇకపై మా భాగస్వామ్యం నూతనోత్సాహంతో కొత్త మలుపు తీసుకోనుంది. గ్రిడ్ల అనుసంధానం, పునరుత్పాదక ఇంధన వనరులు, సెమీ కండక్టర్లు, సరకు రవాణా గొలసు తదితర కీలక అంశాలపైనా చర్చలు జరిపాం. చర్చలు ఫలప్రదంగా సాగాయి.’ అని మోదీ వ్యాఖ్యానించారు. సంక్షిష్ట అంశాల్లో భాగస్వామ్యం పెంపుకోసం.. ఇరు దేశాల మధ్య సంక్లిష్టంగా మారిన కొన్ని అంశాల్లో సందిగ్ధతను తొలగించుకునేందుకు ఇండియా–సౌదీ వ్యూహాత్మక భాగస్వామ్య మండలిని నెలకొల్పాలని 2019 ఏడాదిలో నిర్ణయించారు. జీ20 సదస్సు తర్వాత భారత్‌లో సల్మాన్ బిన్ అధికారిక పర్యటన కొనసాగిస్తున్నారు. ‘ భారత్‌కు రావడం ఆనందంగా ఉంది. జీ20 సదస్సుకు విజయవంతంగా నిర్వహించినందుకు భారత్‌కు నా అభినందనలు. విశ్వ శ్రేయస్సు కోసం జీ20 సదస్సులో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. మోదీతో చర్చలు ఫలవంతంగా సాగాయి. మా రెండు దేశాల ఉజ్వల భవిష్యత్తు కోసం ఇకమీదటా కలిసి పనిచేస్తాం’ అని సల్మాన్ వ్యాఖ్యానించారు. మధ్య ప్రాచ్యంలో భారత్‌కు సౌదీ అరేబియా దేశం అత్యంత కీలకమైంది. గత కొన్నేళ్లలో ఈ రెండు దేశాల మధ్య మరింత మెరుగైన సత్సంబంధాలు ఏర్పడ్డాయి. రక్షణ, భద్రత సంబంధ అంశాలపై ఎక్కువగా దృష్టిపెట్టాయి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం జీవితకాల గరిష్టానికి చేరుకున్న వేళ సల్మాన్ బిన్ భారత్‌లో పర్యటించడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరంలో భారత్–సౌదీ వాణిజ్య వ్యాపారం విలువ ఏకంగా 52.75 బిలియన్ డాలర్లకు చేరుకోవడం విశేషం. భారత్‌కు సౌదీ నాలుగో అతిపెద్ద వాణిజ్యభాగస్వామిగా కొనసాగుతోంది. 13 లక్షల సైన్యానికి సారథి అయిన నాటి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ జనరల్ ఎంఎం నరవాణె 2020 డిసెంబర్లో సౌదీలో పర్యటించారు. భారత సైన్యాధ్యక్షుడు ఒకరు సౌదీలో పర్యటించడం ఇదే తొలిసారి. -
విచ్ఛిన్న శక్తులపై ఉమ్మడి పోరు
న్యూఢిల్లీ: పరస్పర విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే ఉగ్రవాద, ఛాందసవాద శక్తులను కలిసికట్టుగా ఎదుర్కోవాలని భారత్, బంగ్లాదేశ్ నిర్ణయించాయి. భారత్ పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మంగళవారం ద్వైపాక్షిక చర్చల అనంతరం హైదరాబాద్ హౌస్‌లో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘ఉగ్రవాదం, ఛాందస వాదంపై పోరులో సహకరించుకోవాలని మేం నిర్ణయించాం. 1971 నాటి స్ఫూర్తిని సజీవంగా నిలుపుకునేందుకు రెండు దేశాల మధ్య కొనసాగుతున్న పరస్పర విశ్వాసానికి విఘాతం కలిగించేందుకు ప్రయత్నించే శక్తులపై ఉమ్మడిగా పోరాడాలని అంగీకారానికి వచ్చాం’ అని అన్నారు. రెండు దేశాలను కలుపుతూ ప్రవహించే 54 నదులపై ఆధారపడి కోట్లాదిమంది రెండు దేశాల ప్రజలు శతాబ్దాలుగా జీవిస్తున్నారని మోదీ వివరించారు. ‘మైత్రి, సహకారభావం స్ఫూర్తితో రెండు దేశాలు ఎన్నో అంశాలను పరిష్కరించుకున్నాయి. తీస్తా నదీ జలాల పంపిణీ సహా అన్ని ప్రధాన సమస్యలపై త్వరలోనే అంగీకారం కుదురుతుందని ఆశిస్తున్నాను’ అని ప్రధాని మోదీ అన్నారు. బంగ్లాదేశ్‌తో సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందం(సెపా)పై త్వరలోనే చర్చలు మొదలవుతాయని వెల్లడించారు. బంగ్లాదేశ్‌పై చైనా పలుకుబడి పెరిగిపోవడంపైనా ఇద్దరు నేతలు పూర్తిస్థాయిలో చర్చించారని విదేశాంగ శాఖ కార్యదర్శి వినయ్ క్వాట్రా చెప్పారు. ఏడు ఒప్పందాలపై సంతకాలు మోదీ, హసీనాల చర్చల అనంతరం రెండు దేశాల అధికారులు రైల్వేలు, అంతరిక్ష పరిజ్ఞానం, నదీ జలాల పంపిణీ, అనుసంధానతకు సంబంధించిన 7 ఒప్పందాలపై సంతకాలు చేశారు. వీటిలో కుషియారా నదీ జలాల ఒప్పందం కూడా ఉంది. దీనిద్వారా బంగ్లాదేశ్‌లోని సిల్హెట్, భారత్‌లో దక్షిణ అస్సాం లాభపడతాయి. 1996లో గంగా జలాల ఒప్పందం తర్వాత రెండు దేశాల మధ్య కుదిరిన నదీ జలాల ఒప్పందం ఇదే. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ అభ్యంతరాలతో 2011 నుంచి తీస్తా నదీ జలాల పంపిణీ వివాదం కొనసాగుతుండటంపై హసీనా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుదిరిన ఎంవోయూలు.. బంగ్లాదేశ్ రైల్వే ఉద్యోగులకు వివిధ అంశాల్లో శిక్షణ, ఐటీ సొల్యూషన్స్ భారత్ సమకూర్చుతుంది. బంగ్లాదేశ్ ప్రభుత్వ రోడ్లు, హైవేల శాఖకు భారత్ నిర్మాణ సామగ్రి, యంత్రాలను అందజేయనుంది. ఖుల్నా–దర్శన రైలు మార్గం ప్రాజెక్టులో ట్రాక్ డబ్లింగ్ పనుల్లోనూ, పర్బతీపూర్– కౌనియా రైలు మార్గాన్ని డబుల్ లైన్‌గా మార్చేందుకు భారత్ సాయం చేయనుంది. ఖుల్నాలోని రాంపాల్ వద్ద 1,320 మెగావాట్ల సూపర్ క్రిటికల్ బొగ్గు ఆధారిత ప్లాంట్ మైత్రి యూనిట్–1ను, ఖుల్నా–మోంగ్లా పోర్టు ప్రాజెక్టులోని 5.13 కిలోమీటర్ల రుప్షా రైలు వంతెనను ప్రారంభించారు. షేక్ హసీనాకు ఘన స్వాగతం బంగ్లా ప్రధాని షేక్ హసీనా నాలుగు రోజుల పర్యటనకు గాను సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోదీ ఆమెకు స్వాగతం పలికారు. రెండు దేశాల మధ్య సంబంధాలకు సహకారం, పరస్పర విశ్వాసమే ప్రాతిపదిక అని ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. ‘ఆర్థిక వ్యవస్థను అభివృద్ధి చేసుకోవడం, ప్రజల ప్రాథమిక అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యం. మైత్రితో ఎలాంటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చునని మా విశ్వాసం’అని హసీనా అన్నారు. అనంతరం హసీనా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌తో భేటీ అయ్యారు. రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్మునికి పుష్పాంజలి ఘటించారు. -
హైదరాబాద్ హౌస్‌లో భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సు
న్యూఢిల్లీ: భారత్-జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో భాగంగా.. శనివారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ ప్రధాని ఫుమియో కిషిదాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. గతేడాది బాధ్యతలు చేపట్టిన జపాన్ ప్రధాని భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. జపాన్ అధికారుల ప్రధాని మోదీతో ఆయన భేటీ అనంతరం ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంఓ) ట్విట్టర్లో.. ఇరు ప్రధానులు న్యూఢిల్లీలో ఉత్పాదక చర్చలు జరిపారు. ఇరువురు నేతలు ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను పెంపొందించే మార్గాలపై చర్చించారు. భారత్, జపాన్ మధ్య వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని ఇరువురు నేతలు ఆకాంక్షించారు. అని పేర్కొంది. భారత్ పర్యటనకు రాకముందు జపాన్ ప్రధాని కిషిడా ఇలా అన్నారు... "నేను భారత్ పర్యటన తరువాత కంబోడియా పర్యటనకు వెళ్తున్నాను. ఉక్రెయిన్‌పై రష్యా దాడి సమయంలో ఈ పర్యటనల ద్వారా నేను అంతర్జాతీయ ఐక్యత, ప్రాముఖ్యతను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. జపాన్ భారత్ వివిధ సమస్యలపై కలిసి పనిచేస్తాయని విశ్వసించండి. టోక్యోలో జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, యునైటెడ్ స్టేట్స్ నాయకుల మధ్య జరిగే క్వాడ్ సమ్మిట్ విజయవంతానికి కృషి చేయాలనే మా ఉద్దేశ్యాన్ని భారత ప్రధాని మోదీతో కలిసి ధృవీకరించాలనుకుంటున్నాను. అని చెప్పారు. ఉక్రెయిన్ పై దాడి చేస్తున్న రష్యా పై జపాన్ ఆంక్షలు విధించడమే కాక ఉక్రెనియన్ శరణార్థులను స్వీకరించింది. ఈ శిఖరాగ్ర సమావేశం చివరిసారిగా 2018 అక్టోబర్‌లో మోదీ, అప్పటి జపాన్ ప్రధాని షింజో అబే మధ్య జరిగింది. కానీ ఆ తర్వాత ఏడాది 2019లో గౌహతిలో పౌరసత్వ సవరణ చట్టంపై నిరసనల కారణంగా సమ్మిట్ నిర్వహించలేకపోయింది. గత రెండేళ్లు కోవిడ్-19 మహమ్మారి కారణంగా 2020 నుంచి 2021 వరకు శిఖరాగ్రసమావేశన్ని నిర్వహించలేదు. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ ఏడాది నిర్వహించిన శిఖరాగ్ర సమావేశం భారత్, జపాన్ల మధ్య దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవాన్ని సూచిస్తుంది. భారత్ జపాన్ రెండూ తమ భాగస్వామ్యాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ జపాన్‌లు తమ 'ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్య పరిధిలో బహుముఖ సహకారాన్ని కలిగి ఉన్నాయని పేర్కొంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరత శ్రేయస్సు కోసం తమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకే కాక విభిన్న రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి బలోపేతం చేయడానికి పరస్పర సహకరంతో ప్రాంతీయ అంతర్జాతీయ సమస్యలపై అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి ఈ సదస్సు అవకాశం కల్పిస్తుందని వెల్లడించింది. (చదవండి: వాళ్లు అన్నదాంట్లో తప్పేముంది!: ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు) -
విందుకు వేళాయె...
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి భవన్లో ప్రత్యేక విందు సమావేశం ఏర్పాటు చేశారు. విందుకు హాజరైన ట్రంప్ దంపతులను కోవింద్, ఆయన భార్య సవిత కోవింద్ ఆహ్వానం పలికారు. రాష్ట్రపతి భవన్లో దర్బార్ హాలులోకి ట్రంప్ దంపతుల్ని తీసుకువెళ్లి అంతా చూపించారు. ఆ హాలులో 5వ శతాబ్దం నాటి గౌతమ బుద్ధుడి విగ్రహం, భారతీయ నాయకులు చిత్రపటాలు ఉన్నాయి. ఆ తర్వాత ట్రంప్, కోవింద్ కాసేపు మాట్లాడుకున్నారు. భారత్, అమెరికా మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయని, ఇందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి ట్రంప్‌కి ఘనస్వాగతం పలకడమే నిదర్శనమని అన్నారు. అమెరికా తమకు అత్యంత విలువైన మిత్ర దేశమని, ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి భారత్ కట్టుబడి ఉందని అన్నారు. ఈ రెండు రోజులు అద్భుతంగా గడిచాయని, ఎంతో ప్రయోజనకరమైన చర్చలు జరిగాయని ట్రంప్ తెలిపారు. వాణిజ్య, రక్షణ ఒప్పందాల్లో ముందడుగులు పడ్డాయని చెప్పారు. భారత్‌కు రావడం వల్ల ఎంతో నేర్చుకున్నామని,, ఎన్నో అందమైన అనుభూతులతో తిరిగి వెళుతున్నామని ట్రంప్ చెప్పారు. రాష్ట్రపతి కోవింద్ చేసిన అతిథి మర్యాదలకు ఆయనకు, ఆయన అనుచర వర్గానికి ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. ఈ విందుకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులతోపాటు నలుగురు ముఖ్యమంత్రులు కె.చంద్రశేఖర్‌రావు(తెలంగాణ), బీఎస్ యడియూరప్ప(కర్ణాటక), మనోహర్‌లాల్ ఖట్టర్ (హరియాణా),శర్బానంద సోనోవాల్(అస్సాం)..సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ, బ్యాంకర్ ఉదయ్ కొటక్, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ హాజరయ్యారు. అమెరికా అధ్యక్షుడి రాకను పురస్కరించుకుని రాష్ట్రపతి భవన్‌ను సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. విందు అనంతరం ట్రంప్ తిరుగు పయనమయ్యారు. ఇవాంకా, కుష్నర్ దంపతులను రాష్ట్రపతికి పరిచయం చేస్తున్న ట్రంప్..చిత్రంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య విందు ప్రత్యేకత ఏమంటే.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి కోవింద్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందు భలే పసందుగా ఉంది. ట్రంప్ మాంసాహార ప్రియుడు. ఎక్కడికెళ్లినా ఆయనకు బీఫ్ స్టీక్స్, మీట్ లోఫ్, బర్గర్స్ లాంటి వాటినే ఇష్టంగా లాగిస్తారు. అందుకే భారతీయ రుచులు, ట్రంప్ అభిరుచులను దృష్టిలో ఉంచుకొని రాష్ట్రపతి భవన్ వర్గాలు రెండు రకాల మెనూలు తయారు చేశాయి. వెజిటేరియన్ వంటకాలు: కోరియాండర్ షోర్బా, ఆలూ టిక్కీ, పాలక్ పాప్డి, జార్ఖెజ్ జమీన్, దాల్ రైజినా వగైరాలు, నాన్ వెజ్ మెనూ: రాన్ అలీషాన్, కాజూ స్పైస్డ్ సాల్మన్, డెజర్ట్స్: హాజల్‌నెట్ యాపిల్ పై, కారమెల్ సాస్, మల్పువా రబ్రీరోల్.. ఎపిటైటర్‌గా అమ్యూజ్ బౌచె లంచ్ @ హైదరాబాద్ హౌస్ ట్రంప్, మోదీ మధ్య చర్చల అనంతరం హైదరాబాద్ హౌస్‌లో లంచ్ ఏర్పాటు చేశారు. మోదీ పక్కా శాకాహారి కావడంతో రెండు రకాల మెనూలు సిద్ధం చేశారు. ఈ లంచ్‌కి ఫస్ట్ లేడీ మెలానియా, ట్రంప్ కుమార్తె ఇవాంకా, అల్లుడు జేర్డ్ కుష్నర్లు హాజరయ్యారు. సారంగి, సంతూ ర్ జుగల్బందీ చేస్తూ హాయి గొలిపే సంగీతం, గాంధీజీకి అత్యంత ఇష్టమైన వైష్ణవ భజనలు వస్తూ ఉంటే ఈ లంచ్ కార్యక్రమం జరిగింది. భజనలు, ఘజల్స్, పాశ్చాత్య సంగీత, హిందీ సినిమా పాటల్ని ప్లే చేశారు. అణువణువున దేశభక్తి ఉప్పొంగే మిలేసుర్ మేరా తుమ్హారా పాట కూడా వినిపించారు. హిందీ ఆపాత మధురాలైన మేరే గీత్ అమర్ కర్ దో, పీయా తోసే నైనా లగే రే, సత్యం శివం, సుందరం వంటివి గీతాలు ప్లే అవుతూ ఉంటే, అత్యంత ఆహ్లాదకర వాతారవణంలో భోజనాలు చేశారు. పైనాపిల్, మస్టర్డ్ సీడ్స్‌తో తయారు చేసిన అనాస్ సన్సావ్, పనసపండుతో తయారు చేసిన పాంచ్ ఫోరాన్ కాథల్, జీరా బన్, హాక్ చెనా కబాబ్, స్ప్రౌట్స్తో తయారు చేసిన సూప్, రకరకాల రోటీలు, నాన్లు, ఖర్జూరం హల్వా, అంజీర్ ఐస్‌క్రీమ్, చోటీ స్వీట్స్ వంటివి వెజ్ మెనూలో ఉన్నాయి. ఇక నాన్‌వెజ్ వంటకాల్లో కశ్మీర్ కుంకుం పువ్వు వేసిన రిచ్ గ్రేవీతో తయారు చేసిన కోడికూర, చికెన్ పఫ్‌లు, మసాలా తక్కువగా వేసిన మటన్ కర్రీ, పింక్ సాల్మన్ స్వీట్ బాసిల్ చట్నీ వడ్డించారు. -
మాట ముచ్చట C\O హైదరాబాద్ హౌస్
హైదరాబాద్ హౌస్..దేశానికి విదేశీ దేశాధినేతలు వచ్చినప్పుడల్లా ప్రపంచానికి ఈ పేరు వినిపిస్తుంది. ప్రముఖులు రావడం కంటే వారితో మన దేశం చర్చలు జరిపి చేసుకొనే ఒప్పందాలపైనే ప్రపంచ దృష్టి నిలుస్తుంది. ఆ ఒప్పందాలతోపాటే మార్మోగే పేరు హైదరాబాద్ హౌస్. ఇప్పుడు అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్‌తో కీలక ఒప్పందాలకు, ద్వైపాక్షిక చర్చలకు కూడా ఈ భవనమే వేదికై అంతర్జాతీయంగా మరోసారి వెలుగు వెలిగింది.(రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు) ఇంతకూ ఆ భవనమే ఎందుకు? చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్ పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌కు వచ్చినప్పుడు ప్రధాని మోదీతో కలసి ఓ ఊయలలో కూర్చొని కాసేపు మాట్లాడారు. రెండోసారి ఆయన.. మ హాబలిపురంలో సముద్ర తీరాన కొబ్బరి బొండాలను ఆస్వాదిస్తూ చర్చించుకున్నారు. అవ న్నీ సరదా చర్చలకే పరిమితం. అసలు సిసలు చర్చలంటే చలో హైదరాబాద్ హౌస్ అనాల్సిందే. రెండు దేశాల మధ్య ఒప్పందాలు అనగానే వాటిని ఫలప్రదం చేసే స్థాయిలో చర్చలు జరగాలి. ఆ చర్చలకు సానుకూల వాతావరణాన్ని కల్పించే ప్రాంగణం ఉండాలి. అది అబ్బురపరిచే రీతిలో ఠీవిగా ఉండాలి. వాటన్నింటికి కేరాఫ్ అడ్రస్ హైదరాబాద్ హౌసే. ఎందుకంటే ఆ నిర్మాణ కౌశలం గంభీరంగా ఉంటుంది, అందులోని ఇంటీరియర్ రాజసా న్ని ఒలకబోస్తుంది. పచ్చికబయళ్లు గంభీరవా తావరణాన్ని తేలికపరుస్తాయి. ప్రవేశమార్గంలో వాడిన రాతి నగిషీలు మొదలు, భవనంపై న ఉన్న గుమ్మటం శిఖరం వరకు అన్నీ ప్రత్యేకమే, అందుకే ఆ భవనం ఢిల్లీలో ఓ ప్రత్యేకం. (నమస్తే ట్రంప్ అదిరింది... ) నిజాం ప్యాలెస్ సే హైదరాబాద్ హౌస్ తక్ ప్రపంచ ధనవంతుడిగా వెలుగొందిన ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఏది చేసినా తన స్థాయికి తగ్గట్టే ఉండాలని కోరుకున్నాడు. దానికి అప్పట్లోనే హైదరాబాద్‌కు ఒనగూరిన హంగులే సాక్ష్యం. రాచరికంలో కనిపించిన ఆ ర్భాటాన్ని అమితంగా ఇష్టపడే ఆయన కలకు సజీవ సాక్ష్యమే ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్. విదేశాల నుంచి వస్తువులు.. దేశ రాజధానిలో తమకు ఓ విడిది ఉండాలనే ది అప్పటి సంస్థానాధీశుల కోరిక. అందుకు నాటి ఆంగ్ల పాలకులు అంగీకరించారు. అంతే స్థలాలు సమకూర్చుకొని భారీ ప్యాలెస్‌లు ని ర్మించుకున్నారు. ఢిల్లీ అనగానే మన మదిలో మెదిలేది ఇండియా గేట్. ఔరా అనిపించేలా వెలుగొందుతున్న రాష్ట్రపతి భవన్. ఈ రెండు నిర్మాణాలను రూపొందించింది ఒక్కరే. ఆయనే ఎడ్విన్ లూటెన్స్. ఆంగ్లేయుల కాలంలో విఖ్యాత ఆర్కిటెక్ట్. నాటి వైస్రాయ్ అధికారిక నివాసం కోసం అద్భుతంగా రూపొందించిన భవనం అప్పట్లో ప్రపంచంలోనే గొప్ప ప్యాలె స్‌గా అలరారింది. దాన్ని చూడగానే ఢిల్లీలోని తన అధికారిక నివాసం అలాగే ఉండాలన్న ఉ ద్దేశంతో ఎడ్విన్‌కు దాని ప్రణాళిక బాధ్యతలు అప్పగించాడు ఏడో నిజాం. ఇంకేముంది.. ఫర్నిచర్ కోసం కలప, ఫ్లోరింగ్ కోసం రాళ్లు విదేశాల నుంచి చకచకా వచ్చేశాయి. 1926లో నిర్మాణం ప్రారంభించిన రెండేళ్లలో పూర్తి చేశా రు. 8.77 ఎకరాల విస్తీర్ణంలో 36 గదులతో కూడిన ఈ భవన నిర్మాణానికి రూ. 1.86 కో ట్లు ఖర్చయ్యాయి. తొలుత నిజాం ప్యాలెస్‌గా పేరొందిన ఈ భవనం స్వాతంత్య్రానంతరం హైదరాబాద్ హౌస్‌గా మారింది. కొడుకులకు నచ్చలేదు.... నిజాం జీవన విధానం పూర్తి ఇస్లాం పద్ధతిలో ఉండేది. మతానికి ఆయన ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. తన వారసులనూ అలానే పెంచా రు. ఆయన కుమారులు అంతకంటే ఎక్కువ గా మతానికి ప్రాధాన్యం ఇచ్చారు. హైదరాబాద్ హౌస్ విషయంలో తండ్రీకొడుకుల మధ్య అభిప్రాయభేదాలకు కూడా అదే కారణమైంది. రాజప్రాసాదంలా ఉండాలన్న ఉద్దేశం తో హైదరాబాద్ హౌస్‌కు ఆయన ఆర్కిటెక్ట్‌గా నియమించుకున్న ఎడ్విన్‌కు నిర్మాణంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అప్పటికే సిద్ధమైన వైస్రాయ్ భవనంపై ఉండే గుమ్మటం (డోమ్) సాంచీలో ఉండే బౌద్ధస్థూపం నమూనాలో నిర్మించారు. దానికి కాస్త పోలికలుంటూనే యూరోపియన్ నిర్మాణ శైలితో నియో క్లాసికల్‌గా హైదరాబాద్ హౌస్‌పై డోమ్‌ను నిర్మించారు. దీంతోపాటు మొత్తం భవనం నాటి ఆధు నిక యురోపియన్ ఆర్కిటెక్ట్ శైలితో రూపొందింది. దీన్ని చూసి దేశవిదేశీ ప్రముఖులు అద్భుతంగా ఉందని మెచ్చకున్నారు. ఈ మెచ్చుకోలుకు నిజాం పొంగిపోయాడు. కానీ ఆయ న ఇద్దరు కుమారులు అజంజాహి, మొజం జాహీ మాత్రం నొచ్చుకున్నారు. అందుకే వారు ఆ భవనంలో ఉండలేమని తేల్చి చెప్పారు. కాసేపు భవనంలో కాలక్షేపం చేసినా.. తర్వాత వాళ్లు అందులోకి రావడానికి నిరాకరించారు. నాలుగు పర్యాయాలే వచ్చిన నిజాం ఎంతో ముచ్చటపడి కట్టించుకున్న ఆ అద్భుత ప్యాలెస్‌ను నిజాం సందర్శించింది మాత్రం నాలుగు పర్యాయాలేనట. 1928లో భవనం ప్రారంభానికి ఆయన వచ్చినప్పుడు ఢిల్లీ వీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు. భారీ ర్యాలీ మధ్య ఆయన భవనానికి చేరుకుని అందులో విడిది చేశారు. ఆ తర్వాత 1932లో కుమారులతో కలిసి వచ్చారు. స్వాతంత్య్రానంతరం ఒక పర్యాయం వచ్చారు. హైదరాబాద్ సంస్థానం భారతయూనియన్‌లో విలీనం అయ్యాక రాజ్‌ప్రముఖ్‌గా బాధ్యతలు స్వీకరించిన నిజాం 1954లో చివరిసారి హైదరాబాద్ హౌస్‌కు వచ్చారు. నెహ్రూకు హైదరాబాద్ చాయ్ తాగించిందిక్కడే నిజాం తన చివరి పర్యటనలో భాగంగా ఆ ప్యాలెస్‌కు వచ్చినప్పుడు అక్కడ భారీ ఎత్తున గార్డెన్ పార్టీ ఏర్పాటు చేశారు. దానికి నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, నాటి రాష్ట్రపతి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. వారికి ఆయన ప్రత్యేకంగా హైదరాబాద్ చాయ్ తాగించారు. ప్యాలెస్ ముందు పచ్చికబయళ్లలో అటూఇటూ కలియతిరుగుతూ నెహ్రూ చాయ్‌ను ఆస్వాదించారని చెబుతారు. ఇప్పుడు అదే ప్రధాన ఆతిథ్య విడిది విదేశీ ప్రముఖులు వస్తే చాలు ద్వైపాక్షిక చర్చలు, ఉమ్మడి విలేకరుల సమావేశాలు, సదస్సులు, స మావేశాలు..ఇలా అన్నింటికీ ఇప్పు డు హైదరాబాద్ హౌసే వేదిక. మోదీ ప్రధాని అయ్యాక భారత్‌కు విదేశీ దేశాధినేతల రాక బాగా పెరిగింది. దాంతోపాటు హైదరాబాద్ హౌస్‌లో సందడి కూడా అధికమైంది. ట్రంప్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
మోదీ-ట్రంప్ ద్వైపాక్షిక చర్చలు
-
హైదరాబాద్ హౌజ్‌లో మోదీ-ట్రంప్ చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ : భారత పర్యటలో ఉన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హైదరాబాద్ హౌజ్‌కు చేరుకున్నారు. మంగళవారం ఉదయం రాష్ట్రపతి భవన్‌కు వెళ్లిన ట్రంప్.. అక్కడ త్రివిధ దళాల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం అక్కడి నుంచి ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌కు వెళ్లి మహాత్ముడి సమాధి వద్ద నివాళులర్పించారు. ఆ క్రమంలోనే ట్రంప్ దంపతులు రాజ్‌ఘాట్‌లో మొక్కను నాటారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, ట్రంప్ కలిసి హైదరాబాద్ హౌజ్‌కు వెళ్లారు. హైదరాబాద్ హౌజ్‌లో భారత్, అమెరికాల మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగనున్నాయి. ఇరు దేశాల మధ్య 300 కోట్ల డాలర్ల విలువైన డిఫెన్స్ డీల్‌తో పాటు ఐదు ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాముంది. మోదీ, ట్రంప్ చర్చల్లో పలు ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పరిశుభ్ర భవనంగా రాష్ట్రపతి భవన్!
న్యూఢిల్లీ: దేశరాజధానిలో పరిశుభ్రమైన భవనాల జాబితాలో రాష్ట్రపతి భవన్, హైదరాబాద్ హౌజ్, యూపీఎస్సీ బిల్డింగ్తోపాటు జవహార్‌లాల్ నెహ్రూభవన్ మొదటి స్థానంలో ఉన్నయని.. తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఢిల్లీలోని 36 ప్రముఖ భవంతుల్లో స్వచ్ఛతపై జరిపిన ఈ సర్వేలో.. ఎన్నికల సంఘం, జైపూర్, జామ్‌నగర్, జైసల్మేర్ భవనాలు చివరి స్థానంలో ఉన్నాయి. స్వచ్ఛభారత్ మిషన్ పనితీరు అంచనావేసేందుకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మార్చి 16-21 వరకు ఈ సర్వే నిర్వహించింది. -
హైదరాబాద్ హౌస్
దిల్లీ అశోకా రోడ్డులో ఉన్న హైదరాబాద్‌హౌస్... హైదరాబాద్ వారిదే! దిల్లీలోని అత్యంత అందమైన పురాతన భవనాల్లో ఇదొకటి. ఏడో నిజాం ప్రభువు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆదేశాల మేరకు దీని నిర్మాణం 1930లో ప్రారంభించి... 1933 నాటికి పూర్తి చేశారు. బ్రిటిష్ పాలకుల ఏలుబడిలో వారి రాజధానిని కోల్‌కతా నుంచి దిల్లీకి మార్చే సమయంలో ప్రస్తుత భారత రాష్ట్రపతి నిలయం, పార్లమెంటు భవనం, సుప్రీంకోర్టు తదితర ప్రతిష్టాత్మకమైన భవనాల నిర్మాణం పెద్ద ఎత్తున చేపట్టారు. ఇందుకోసం ఆనాటి ప్రముఖ బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుటిన్స్ను ప్రత్యేకంగా ఇంగ్లండ్ నుంచి పిలిపించారు. సరిగ్గా ఈ సమయంలో ఎడ్విన్ లుటిన్స్ సూచనల మేరకు హైదరాబాద్ హౌస్ నిర్మాణం బాధ్యత ఏడో నిజాం చేపట్టారు. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో గల ప్రముఖ ఇంజనీరు అలీ నవాబ్ జంగ్ పర్యవేక్షణలో కేవలం మూడేళ్లలో ఈ హౌస్ నిర్మాణం పూర్తి చేసిన ట్లు చరిత్రకారులు చెబుతారు. స్వాతంత్య్రానంతరం, 1948లో పోలీసుల చర్య తర్వాత హైదరాబాద్ హౌస్‌ను భారత ప్రభుత్వం స్వాధీనపరుచుకుంది. నేడు పలు ప్రభుత్వ అధికార ఉన్నత స్థాయి సమావేశాలకు నిలయంగా హైదరాబాద్ హౌస్ అతిథ్యమిస్తోంది. ఇటీవల భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షునికి ప్రభుత్వం ఇక్కడే అతిథ్యమిచ్చింది. విశాలమైన ఈ భవన ప్రాంగణంలోని డైనింగ్ హాలు నేటికీ చూపరులను ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ నిజాం ప్రభువు తన అతిథి గృహంగా నిర్మించుకున్న ఈ భవనాలను అప్పట్లో ప్యాలెస్ ఆఫ్ ది నిజామ్ ఆఫ్ హైదరాబాద్ అని పిలిచేవారు. బ్రిటిష్ పాలకుల రోజుల్లో మహారాజులు, సంస్థానాధీశులందరూ చాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ పేరిట దిల్లీలో తరచూ సమావేశమవుతుండేవారు. ఈ సమావేశాలకు హాజరైనప్పుడు తగిన బస ఏర్పాటు అవసరమైన ఏడో నిజాం దిల్లీలో తన కోసం ప్రత్యేకంగా ఒక అతిధి గృహం నిర్మించుకున్నాడని చరిత్రకారుల అభిప్రాయం. ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్, యావత్తు ప్రపంచంలోనే అత్యంత ధనకునిగా ఖ్యాతి గడించిన విషయం తెలిసిందే. హైదరాబాద్ హౌస్‌ను మొఘల్, యూరోపియన్ ఆర్కిటెక్చర్‌తో, ఆకాశం నుంచి చూసే వారికి సీతాకోక చిలుక మాదిరిగా కనిపించేలా ఎంతో సుందరంగా నిర్మించారు. ఈ సుందర భవనంలో 36 విశాలమైన గదులున్నాయి. దిల్లీలోని ఇండియా గేట్‌కు వాయువ్యంగా, కొద్దిపాటి దూరంలోనే రాచరికపు ఠీవితో హైదరాబాద్ హౌస్ సొగసులీనుతుంటుంది. - మల్లాది కృష్ణానంద్ malladisukku@gmail.com -
మోదీ విందులో ఒబామా ఏం తిన్నారు..?
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌజ్‌లో ఒబామా, మోదీ కలసి భోజనం చేశారు. శాఖహారి అయిన మోదీ.. ఒబామా కోసం వెజ్, నాన్‌వెజ్ భారతీయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు. విందులో వెజ్, నాన్‌వెజ్ వంటకాలతో రెండు మెనూలు ఏర్పాటు చేశారు. కశ్మీర్ వంటకం నడ్రు కె గూలర్, బెంగాల్ వంట మహి సర్సాన్తో పాటు షట్వార్ కా షోర్బా, అనానస్ ఔర్ పనీర్ కా సూలా, మటర్ పలావ్, గుజరాతీ కడీ, మిక్స్డ్ వెజిటబుల్ కలోంజి, కెలా మేథీ ను షాక్, పనీర్ లబబ్దార్, గాజర్ కా హల్వా, గులాబ్ జామూన్, పండ్లను సిద్ధంగా ఉంచారు. ఒబామా ఏయే పదార్థాలను రుచి చూశారో బయటకు తెలియరాలేదు. దక్షిణ భారత దేశంలో తాగే కాఫీ, హెర్బల్ టీని అందజేశారు. ఒబామాకు ఈ రోజు రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఇవ్వనున్నారు. వెజ్‌తో పాటు నాన్‌వెజ్ వంటకాలను వడ్డించనున్నారు. మటన్ రోగన్ జోష్, గలౌటీ కబాబ్, పనీర్ మలై టిక్కా మెనూలో చేర్చారు. -
ఒబామాకు స్వయంగా టీ కలిపిచ్చిన మోదీ
న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై ప్రధాని నరేంద్ర మోదీ అవాజ్యమైన అభిమానం కురింపించారు. భారత గడ్డపై అడుగుపెట్టిన ఒబామాకు స్వయంగా స్వాగతం పలికిన మోదీ తర్వాత కూడా అదేరకమైన అభిమానం చూపించారు. హైదరాబాద్ హౌజ్ లో ఒబామాతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన మోదీ ఆయనతో కలిసి 'వాక్ అండ్ టాక్'లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒబామాకు స్వయంగా టీ కలిపి ఇవ్వడం విశేషం. టీ కప్పును స్వహస్తాలతో ఒబామాకు అందించారు. పూర్వాశ్రమంలో మోదీ.. ఛాయ్ వాలా అన్న సంగతి జగద్విదితం. టీ తాగుతూ ఇరువురు అగ్రనేతలు చర్చల్లో మునిగితేలారు. ఈ సందర్భంగా మోదీ చాలా ఉల్లాసంగా ఆత్మవిశ్వాసంతో కనిపించారు. తాను చెప్పాల్సిన విషయాలను ఒబామాకు సూటిగా చెప్పినట్టు తెలుస్తోంది. మోదీ ఆత్మీయ అతిథ్యానికి అగ్రరాజ్యాధినేత ముగ్దులయ్యారు. -
ఒబామాతో మోదీ కీలక చర్చలు
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత ప్రధాని నరేంద్ర మోదీతో హైదరాబాద్ హౌస్ లో కీలక చర్చలు జరుపుతున్నారు. మధ్యాహ్న భోజనం సమయం సందర్భంగా ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. సరిహద్దు తీవ్రవాదం అంశాన్ని ఈ సందర్భంగా మోదీ లేవలెత్తినట్టు సమాచారం. సరిహద్దులో పాకిస్థాన్, చైనా చొరబాబు గురించినట్టు ప్రస్తావించినట్టు తెలుస్తోంది. లంచ్ తర్వాత ఒబామాతో కలిసి మోదీ 'వాక్ అండ్ టాక్'లో పాల్గొన్నారు. -
కువైట్ ప్రగతిలో ఎన్నారైలే కీలకం
కువైట్ దేశ ప్రగతిలో ఎన్నారైలు కీలక భూమిక పోషిస్తున్నారని ఆ దేశ ప్రధాని షేక్ జబ్బర్ అల్ ముబారక్ అల్ హమిద్ అల్ సబ కీర్తించారు. భారత పర్యటలో భాగంగా ఆయన శుక్రవారం రాత్రి న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో భారత్ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో భేటీ అయ్యారు. కువైట్ దేశాభివృద్ధిలో ఎన్నారైలు అందిస్తున్న సేవలను ఈ సందర్బం ఆయన ప్రధాని మన్మోహన్‌కు వివరించారు. తమ దేశంలో 7 లక్షల మంది ఎన్నారైలు ఉన్నారని ఆయన ఈ సందర్భంగా ప్రధాని మన్మోహన్‌కు గుర్తు చేశారు. కువైట్, భారత్ దేశాల అనుబంధానికి వారు వారధిగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. కువైట్‌లో ఎంతోమంది విదేశీయులు ఉన్నారని, కానీ ఎన్నారైలది ప్రత్యేకమైన శైలీ అని చెప్పారు. భారత దేశ సంస్కృతికి, ప్రగతులకు ఎన్నారైలు నిలువెత్తు నిదర్శనమని అల్ హమిద్ అల్ సబ చెప్పారు. దేశంలో ప్రైవేట్ రంగంలో ఎన్నారైలు అందింస్తున్న సేవలను కువైట్ ప్రధాని భారత్ ప్రధానికి ఈ సందర్భంగా విశదీకరించారు.