మోదీ విందులో ఒబామా ఏం తిన్నారు..? | what is obama's menu | Sakshi
Sakshi News home page

మోదీ విందులో ఒబామా ఏం తిన్నారు..?

Published Sun, Jan 25 2015 4:01 PM | Last Updated on Fri, Aug 24 2018 1:53 PM

మోదీ విందులో ఒబామా ఏం తిన్నారు..? - Sakshi

మోదీ విందులో ఒబామా ఏం తిన్నారు..?

న్యూఢిల్లీ: భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు ప్రధాని మోదీ విందు ఏర్పాటు చేశారు. ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ హౌజ్లో ఒబామా, మోదీ కలసి భోజనం చేశారు. శాఖహారి అయిన మోదీ.. ఒబామా కోసం వెజ్, నాన్వెజ్ భారతీయ వంటకాలతో విందు ఏర్పాటు చేశారు.

విందులో వెజ్, నాన్వెజ్ వంటకాలతో రెండు మెనూలు ఏర్పాటు చేశారు. కశ్మీర్ వంటకం నడ్రు కె గూలర్, బెంగాల్ వంట మహి సర్సాన్తో పాటు షట్వార్ కా షోర్బా, అనానస్ ఔర్ పనీర్ కా సూలా, మటర్ పలావ్, గుజరాతీ కడీ, మిక్స్డ్ వెజిటబుల్ కలోంజి, కెలా మేథీ ను షాక్, పనీర్ లబబ్దార్, గాజర్ కా హల్వా, గులాబ్ జామూన్, పండ్లను సిద్ధంగా ఉంచారు. ఒబామా ఏయే పదార్థాలను రుచి చూశారో బయటకు తెలియరాలేదు. దక్షిణ భారత దేశంలో తాగే కాఫీ, హెర్బల్ టీని అందజేశారు. ఒబామాకు ఈ రోజు రాత్రి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విందు ఇవ్వనున్నారు. వెజ్తో పాటు నాన్వెజ్ వంటకాలను వడ్డించనున్నారు. మటన్ రోగన్ జోష్, గలౌటీ కబాబ్, పనీర్ మలై టిక్కా మెనూలో చేర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement