ఆడపిల్ల పుట్టిందని.. అమ్మ ఎంత పనిచేసింది! | mother committed suicide in chennai | Sakshi
Sakshi News home page

ఆడపిల్ల పుట్టిందని.. అమ్మ ఎంత పనిచేసింది!

Published Sat, May 27 2017 1:36 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM

ఆడపిల్ల పుట్టిందని.. అమ్మ ఎంత పనిచేసింది!

ఆడపిల్ల పుట్టిందని.. అమ్మ ఎంత పనిచేసింది!

చెన్నై: దేవుడు ప్రతిచోటా ఉండలేడు కాబట్టే అమ్మను ఇచ్చాడని అంటారు. కానీ అలాంటి అమ్మే తొలికాన్పులో ఆడపిల్ల పుట్టిందని అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఆడపిల్ల పుట్టిందనే ఆవేదనతో ఏకంగా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలో ఈ ఘటన జరిగింది.

చెన్నై క్రోంపేట లక్ష్మీపురానికి చెందిన చరణ్‌రాజ్, శివరంజని (23) పెళ్లయి రెండున్నరేళ్లు అవుతోంది. గర్భవతి అయిన శివరంజని తొలికాన్పులో ఈ నెల మొదటివారంలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మగబిడ్డ కావాలని ఆశిస్తే తనకు ఆడపిల్ల పుట్టడంతో శివరంజనీ రోజూ కలత చెందేది. ఇదే ఆవేదనతో గురువారం రాత్రి ఆమె తన ఇంటి మూడో అంతస్తుపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. వివాహమై రెండున్నర ఏళ్లు అవుతోంది. ఇంతలోనే ఆడబిడ్డ పుట్టిందన్న కారణంతో ఆమె ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement