కోర్టులో సృహతప్పిన ముంబై గ్యాంగ్ రేప్ బాధితురాలు!
Published Thu, Oct 17 2013 6:30 PM | Last Updated on Tue, Sep 3 2019 8:44 PM
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ముంబై గ్యాంగ్ రేప్ కేసులో బాధితురాలు, ఫోటో జర్నలిస్ట్ కోర్టులోనే సృహ కోల్పోయింది. నిందితులను గుర్తించిన బాధితురాలు.. వాగ్మూలం ఇచ్చే సమయంలో కోర్టులో సొమ్మసిల్లి పడిపోయిందని ప్రత్యక్ష సాక్ష్యులు వెల్లడించారు. ఫోటో జర్నలిస్ట్ సృహతప్పి పడిపోయిన వెంటనే వాదనలు ఆపివేసి ఆమెను వైద్యం కోసం ఆస్పత్రికి తరలించామని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ పీటీఐకి తెలిపారు.
ఆగస్టు 22 తేదిన ముంబైలోని శక్తి మిల్స్ కాంపౌడ్ లో బాధితురాలిపై సామూహిక మానభంగం జరిగినట్టు కేసు నమోదైంది. గురువారం జరిగిన వాదనలకు తన తల్లితో బాధితురాలు కోర్టుకు హాజరయ్యారు. పోలీసులకు ఇచ్చిన స్టేట్ మెంట్ కు కట్టుబడి కోర్టులో సంఘటన వివరించినట్టు తెలిపారు. లైంగికంగా దాడికి ముందు చూపించిన అశ్లీల క్లిప్పింగ్ ను కూడా బాధితురాలు గుర్తించినట్టు నికమ్ తెలిపారు.
Advertisement