కూతురికి 'ప్రత్యేక' పెళ్లికానుక ఇచ్చిన తండ్రి | Muslim father gifts cow as special wedding gift to daughter in Haryana | Sakshi
Sakshi News home page

కూతురికి 'ప్రత్యేక' పెళ్లికానుక ఇచ్చిన తండ్రి

Published Tue, Apr 11 2017 1:46 PM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

కూతురికి 'ప్రత్యేక' పెళ్లికానుక ఇచ్చిన తండ్రి - Sakshi

కూతురికి 'ప్రత్యేక' పెళ్లికానుక ఇచ్చిన తండ్రి

రొహతక్‌: గోరక్షణ పేరిట దేశంలో దాడులు పెచ్చుమీరుతున్న ప్రస్తుత తరుణంలో మతసామరస్యం పరిఢవిల్లే ఘటన హర్యానాలో వెలుగులోకి వచ్చింది. ఓ ముస్లిం వ్యక్తి తన కుమార్తె పెళ్లి ప్రత్యేక కానుకగా గోమాతను బహూకరించడం ఆసక్తి కలిగిస్తోంది. సోనిపట్ జిల్లా ఖార్‌ ఖొద్దా గ్రామానికి చెందిన నూర్‌ ఖాన్‌ తన కూతురు గుల్షానాకు పెళ్లికానుకగా ఆవును ఇచ్చాడు. సుమారు 15 వేల రూపాయలతో గోవును కొని తన కుమార్తెకు బహూరించాడు.

తన కూతురికి గోవులంటే చాలా ఇష్టమని నూర్‌ ఖాన్‌ తెలిపాడు. ఆవులు ఎక్కడ కనబడినా బ్రెడ్డు, బెల్లం పెడుతుంటుందని వెల్లడించాడు. ఆవును సాకేందుకు తన ఇంట్లో సరిపడా స్థలం లేనందుకు అతడు విచారం వ్యక్తం చేశాడు. ఓ ముస్లిం వ్యక్తి తన కూతురికి పెళ్లి కానుకగా గోవునివ్వడం హర్యానాలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. తన తండ్రి ఇచ్చిన బహుపతి పట్ల గుల్షానా సంతోషం వ్యక్తం చేసింది. అత్తవారింట్లో ఆవును బాగా చూసుకుంటానని చెప్పింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement