కెన్యా రాజధాని నైరోబీలోని వెస్ట్గేట్ దుకాణ సముదాయంలో తీవ్రవాదాలు దాడి ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆ దేశాధ్యక్షుడు ఉహుర్ కెన్వెట్టా ప్రకటించారు. బుధవారం వెస్ట్గేట్ మాల్ ఘటనలో మరణించిన వారి ఆత్మ శాంతి కలగాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఉహుర్ కెన్వెట్టా ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఇలాంటి తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు ఆ ఘటనపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.
ఆ ఘటనకు గల కారణాలు ఆన్వేషించడమే కాకుండా భద్రత పరంగా తీసుకోవాలసిన చర్యలపై కూడా ఆ కమిషన్ నివేదిక అందిస్తుందని తెలిపారు. అయితే ఘటన జరిగిన ప్రదేశాన్ని పార్లమెంట్లోని భద్రత, రక్షణ సంఘాలతోపాటు రాజకీయా పార్టీల నాయకులు ఇప్పటికే సందర్శించారని చెప్పారు. అయితే వెస్ట్ గేట్ దుకాణ సముదాయంలో నాలుగురోజులపాటు తీవ్రవాదుల దాడిలో 67 మంది మరణించారని చెప్పారు.
కాగా మరో 39 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని రెడ్ క్రాస్ సొసైటీ చెప్పిన విషయాని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. తీవ్రవాదులు ఆ ఘటనకు పాల్పడిన విధానంపై ఇప్పటికే స్థానిక అధికారులతోపాటు, విదేశీ నిఘా సంస్థల అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు.