Uhuru Kenyatta
-
ప్రెసిడెంట్ ఎన్నిక రద్దు.. రీ పోలింగ్
-
ప్రెసిడెంట్ ఎన్నిక రద్దు.. రీ పోలింగ్
- కెన్యా సుప్రీంకోర్టు సంచలన తీర్పు నైరోబీ: దేశాధ్యక్షుడి ఎన్నికను రద్దుచేస్తూ కెన్యా సుప్రీంకోర్టు శుక్రవారం సంచలన తీర్పు చెప్పింది. రాజ్యాంగ నియమాలకు విరుద్ధంగా ప్రెసిడెన్షియల్ ఎలక్షన్లో తీవ్ర అవకతవకలు జరిగాయని అభిప్రాయపడిన కోర్టు.. 8 రోజులలోగా తిరిగి ఎన్నికలు(రీపోలింగ్) నిర్వహించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఆగస్టు 12న వెల్లడైన అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో ఉహురు కెనట్టా(జూబ్లీ పార్టీ) రెండో సారి విజయం సాధించారు. ఆయనకు 54.27 శాతం ఓట్లు రాగా, ప్రత్యర్థి రైలా ఓడింగాకు 44.74 శాతం ఓట్లు వచ్చాయి. అయితే అధికారపక్షం ఈవీఎంలను ట్యాపరింగ్ చేయడంతోపాటు విచ్చలవిడి అవినీతికి పాల్పడిందని ప్రతిపక్ష పార్టీ ఆరోపించింది. అక్రమంగా జరిగిన ఎన్నికలను తక్షణమే రద్దుచేయాలంటూ కోర్టును ఆశ్రయించింది. పిటిషన్ను విచారించిన నలుగురు జడ్జిల బెంచ్ నేడు తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుతో ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకోగా, అధికార పార్టీ కార్యకర్తలు గుర్రుమంటున్నారు. -
కెన్యాలో ఏనుగు దంతాలను తగులబెట్టేశారు
-
ఏనుగు దంతాలను తగలబెట్టేశారు
వన్యప్రాణుల అక్రమ వ్యాపారంలో భాగంగా ప్రతి ఏడాది వేలాది ఏనుగులను స్మగ్లర్లు చంపేస్తున్నారు. ఈ అక్రమ రవాణాను అరికట్టాలని కెన్యా నిర్ణయించింది. అందులో భాగంగా ఇప్పటి వరకు దేశంలో ఏనుగులను చంపి సేకరించిన... దాదాపు రూ.105 మిలియన్ డాలర్ల విలువైన ఏనుగు దంతాలను కెన్యాలోని నైరోబి జాతీయ పార్క్లో శనివారం తగలబెట్టారు. ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా వీటికి నిప్పుంటించారు. దేశంలో దాదాపు 7000 ఏనుగులకు చెందిన దంతాలను అక్రమంగా తరలిస్తుండగా... అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దేశంలో దంతాల అక్రమ వ్యాపారం కోసం ఏనుగులను చంపివేస్తుండటంతో వాటి సంఖ్య భవిష్యత్తులో మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందని కెన్యా భావించింది. అందులోభాగంగా దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏనుగు దంతాలలో ఎవరు ఎటువంటి వ్యాపారం చేయకూడదు అన్నారు. ఈ వ్యాపారం అంటేనే మరణం, ఏనుగులను చంపితే... మన జాతి సంస్కృతి మృతి చెందినట్లే అని దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా ఈ సందర్భంగా పేర్కొన్నారు. దేశంలో ప్రతి పదిహేను నిమిషాలకు ఓ ఏనుగు చంపేస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఇలా అయితే రానున్న 10 ఏళ్లలో మరింత దుర్భరం అవుతుందన్నారు. 1970లో ఆఫ్రికాలో 1.2 మిలియన్ ఏనుగులు ఉండేవని.. కానీ నేటి వాటి సంఖ్య నాలుగు నుంచి నాలుగున్నర లక్షలు మాత్రమే ఉన్నాయన్నారు. ఏనుగు దంతాలను తగలబెట్టడం ద్వారా వేటగాళ్లను కెన్యా ఓ సందేశాన్ని ఇచ్చింది. -
వెస్ట్గేట్ ఘటనపై విచారణకు ఆదేశం: ఉహుర్ కెన్వెట్టా
కెన్యా రాజధాని నైరోబీలోని వెస్ట్గేట్ దుకాణ సముదాయంలో తీవ్రవాదాలు దాడి ఘటనపై విచారణకు ఆదేశించినట్లు ఆ దేశాధ్యక్షుడు ఉహుర్ కెన్వెట్టా ప్రకటించారు. బుధవారం వెస్ట్గేట్ మాల్ ఘటనలో మరణించిన వారి ఆత్మ శాంతి కలగాలని సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. ఆ కార్యక్రమానికి ఉహుర్ కెన్వెట్టా ముఖ్య అతిథిగా హాజరయ్యరు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... ఇలాంటి తరహా ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండేందుకు ఆ ఘటనపై విచారణ కమిషన్ను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఆ ఘటనకు గల కారణాలు ఆన్వేషించడమే కాకుండా భద్రత పరంగా తీసుకోవాలసిన చర్యలపై కూడా ఆ కమిషన్ నివేదిక అందిస్తుందని తెలిపారు. అయితే ఘటన జరిగిన ప్రదేశాన్ని పార్లమెంట్లోని భద్రత, రక్షణ సంఘాలతోపాటు రాజకీయా పార్టీల నాయకులు ఇప్పటికే సందర్శించారని చెప్పారు. అయితే వెస్ట్ గేట్ దుకాణ సముదాయంలో నాలుగురోజులపాటు తీవ్రవాదుల దాడిలో 67 మంది మరణించారని చెప్పారు. కాగా మరో 39 మంది ఆచూకీ ఇంకా తెలియలేదని రెడ్ క్రాస్ సొసైటీ చెప్పిన విషయాని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. తీవ్రవాదులు ఆ ఘటనకు పాల్పడిన విధానంపై ఇప్పటికే స్థానిక అధికారులతోపాటు, విదేశీ నిఘా సంస్థల అధికారులు దర్యాప్తు చేస్తున్నారని వివరించారు. -
నైరోబీలో ముగిసిన పోరు
కెన్యా రాజధాని నైరోబీలోని వెస్ట్గేట్ షాపింగ్ మాల్లో మారణకాండ సృష్టించిన తీవ్రవాదులలో ఐదుగురిని భద్రత సిబ్బంది మట్టుబెట్టాయని ఆ దేశాధ్యక్షుడు ఉహురు కెన్వెట్టా ప్రకటించారు. మరో 11 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. నిన్న సాయంత్రం ఉహురు కెన్వెట్టా టీవీలో జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ... తీవ్రవాదుల ఘాతుక చర్య తమను తీవ్రంగా కలిచి వేసిందని అన్నారు. ఇలాంటి సమయంలో థైర్యంగా ఉండాలని ఆయన దేశ ప్రజలకు హితవు పలికారు. దేశంలో జరిగిన అత్యంత విషాదరకర ఘటనల్లో ఇదో ఒకటని ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండేందుకు షటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవశ్యకతను ఆయన విశదీకరించారు. తీవ్రవాదుల ఘాతుక చర్యలో 61 మంది పౌరులు, ఆరుగురు భద్రత దళ సిబ్బంది మరణించారని చెప్పారు. మృతుల్లో తమ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారని అన్నారు. అయితే మరో 63 మంది ఆచూకీ ఇంతవరకు లభ్యం కాలేదని కెన్యాలోని రెడ్ క్రాస్ సంస్థ వెల్లడించిన సంగతిని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వారి ఆచూకీ కనుగొనేందుకు చర్యలు ముమ్మరం చేసినట్లు ఉహురు కెన్వెట్టా వెల్లడించారు. తీవ్రవాదులు మాస్క్లు ధరించి శనివారం షాపింగ్ మాల్లోకి ప్రవేశించారు. షాపింగ్ మాల్లో ముస్లిం మతస్థులు ఎవరైన ఉంటే వెళ్లిపోవాలని సూచించారు. అనంతరం వారు విచక్షణ రహితంగా కాల్పులకు ఉపక్రమించారు. ఆ క్రమంలో 60 మంది వరకు మరణించారు. మృతుల్లో భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. -
కెన్యాలో తీవ్రవాదుల ఘాతుకం: 39 మంది మృతి
కెన్యా రాజధాని నైరోబిలో ఓ షాపింగ్ మాల్లో తీవ్రవాదులు నిన్న సృష్టించిన మారణహోమాన్ని ఆ దేశాధ్యక్షుడు ఉహుర్ కెన్యెట్టా ఆదివారం తీవ్రంగా ఖండించారు. ఆ తీవ్రవాదుల దుశ్చర్య కారణంగా 39 మంది అమాయకులు దుర్మరణం పాలైయ్యారని తెలిపారు. ఆ ఘటనలో 150 మంది గాయపడ్డారని చెప్పారు. గాయపడిన వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే గాయపడిన వారు దేశంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని పేర్కొన్నారు. మృతుల్లో తమ కుటుంబానికి అత్యంత సన్నిహితులు కూడా ఉన్నారని ఆయన తెలిపారు. అయితే ఆ తీవ్రవాదులు ఘాతుకాని కొన్ని నిముషాల ముందు వందలాది మంది ప్రజలు ఆ షాపింగ్ మాల్ నుంచి బయటకు వచ్చారని చెప్పారు. లేకుంటే మృతుల సంఖ్య మరింత మరణించి ఉండేవారని దేశాధ్యక్షుడు పేర్కొన్నారు. షాపింగ్ మాల్లో భద్రత దళాలు సహాయ చర్యలను ముమ్మరం చేశాయని తెలిపారు. అల్ ఖైదా అనుబంధ సంస్థ సోమాలియాలోని తీవ్రవాద సంస్థ అల్ సబాబ్ ఈ ఘాతుకానికి ఒడిగట్టింది తామేనని ప్రకటించింది. శనివారం ఆ తీవ్రవాద సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు ఆయుధాలు ధరించి షాపింగ్ మాల్లోకి ప్రవేశించారు. అనంతరం ఇక్కడ ముస్లింలు ఎవరైన ఉంటే వెంటనే ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారని ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. అలా కొంత మంది బైటకు వెళ్లిన తర్వాత తీవ్రవాదులు కాల్పులు జరిపారని తెలిపారు. అయితే ఆ దాడిలో అమెరికా పౌరులు కూడా మరణించినట్లు నివేదికలో వెల్లడిస్తున్నాయి.