డ్రైవర్ రహిత కారును పరీక్షించిన నాసా | NASA tested the car on the driver-free | Sakshi
Sakshi News home page

డ్రైవర్ రహిత కారును పరీక్షించిన నాసా

Published Sat, Jan 9 2016 9:29 AM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM

డ్రైవర్ రహిత కారును పరీక్షించిన నాసా - Sakshi

డ్రైవర్ రహిత కారును పరీక్షించిన నాసా

రోబోటిక్ సాఫ్ట్‌వేర్‌తో రూపొందించిన ‘నిస్సాన్’
 
 వాషింగ్టన్: డ్రైవర్ రహిత కారును అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విజయవంతంగా పరీక్షించింది. దీన్ని జపాన్ కంపెనీ నిస్సాన్ రూపొందించింది. రోబోటిక్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఈ కారును అభివృద్ధి చేశారు. సాధారణంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను ఇతర గ్రహాలపై స్వయంగా నడిచే రోవర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ రకం డ్రైవర్ రహిత కార్లు అందరికీ ఉపయోగపడేలా రూపొందించేందుకు నాసాకు చెందిన ఏమ్స్ పరిశోధన కేంద్రం, నిస్సాన్ ఉత్తర అమెరికా సంస్థలు సంయుక్తంగా గత ఏడాది నుంచి శ్రమించాయి. ఈ రెండు సంస్థలు కలసి పనిచేయడం వల్ల ఈ రకం కార్లు తయారు చేయడం  శాస్త్రవేత్తలకు సులువైంది.

లీఫ్ (ఎల్‌ఈఏఎఫ్) అనే ఈ వాహనం సురక్షితంగా, విజయవంతంగా నడుస్తున్నట్లు శాస్త్రవేత్తలు గమనించారు. ఈ వాహనానికి కెమెరాలు, సెన్సార్లు, డేటా నెట్‌వర్కింగ్ వ్యవస్థ, గతంలో తయారు చేసిన ఏమ్స్ కె-10, కె-రెక్స్ రోవర్లలో వాడిన రోబోటిక్ సాంకేతికతను జోడించారు. డ్రైవర్ రహిత కార్ల తయారీలో వాడుకున్న ఈ స్పేస్ టెక్నాలజీని భవిష్యత్‌లో విమాన రంగంలో కూడా వినియోగించేందుకు ఏమ్స్ సంస్థ కృషి చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement