న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ) శనివారం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇచ్చిన హామీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిలుపుకోలేదని ఆరోపించింది. రాజధాని ప్రాంతంలో భూమి చదును కార్యక్రమాలు నిలిపి వేయాలని ఆదేశించింది.పర్యావరణ అనుమతి వచ్చే వరకు సదరు కార్యక్రమాలు ఆపాలని సూచించింది.
అలాగే రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో తోటలను తొలగించవద్దని సూచించింది. రాజధాని భూముల్లో తోటలను తొలగిస్తున్న వైనాన్ని పిటిషనర్ సాక్ష్యాధారాలతో సహా గ్రీన్ ట్రిబ్యునల్ ముందు ఉంచారు. దీంతో రాజధాని భూముల్లో ప్రభుత్వ అనుసరిస్తున్న వైఖరిని ఎన్జీటీ తప్పు పట్టింది. ముంపు, మెట్ట ప్రాంతాలను గుర్తించి నివేదకి ఇవ్వాలని ఏపీ సర్కార్ను ఎన్జీటీ ఆదేశించింది.