రూ. రెండువేల నోటు ఇలా ఉంటుంది! | new Rs2,000 banknote from RBI | Sakshi
Sakshi News home page

రూ. రెండువేల నోటు ఇలా ఉంటుంది!

Published Mon, Nov 7 2016 6:40 PM | Last Updated on Mon, Oct 22 2018 6:05 PM

రూ. రెండువేల నోటు ఇలా ఉంటుంది! - Sakshi

రూ. రెండువేల నోటు ఇలా ఉంటుంది!

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) త్వరలోనే రెండువేల రూపాయల నోటు విడుదల చేస్తున్నదన్న వార్త ఇప్పటికే సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలో రాబోతున్న రూ. రెండువేల నోటు ఇదిగో ఇలా ఉంటుంది అంటూ కొన్ని ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి. మొట్టమొదటిసారిగా మార్కెట్‌లోకి విడుదల అవుతున్న రెండువేల రూపాయల నోటు గులాబీ, తెలుపురంగుల్లో ఇలా ఉంటుందని పలు ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ షేర్‌ అవుతున్నాయి.

 
ఆర్బీఐ కొత్తగా రెండువేల నోట్లకట్టలను విడుదల చేయబోతున్నదని, ఇప్పటికే మైసూర్‌లోని కరెన్నీ ప్రింటింగ్‌ ప్రెస్‌లో వీటి ముద్రణ కూడా పూర్తయిందని, త్వరలోనే ప్రజల్లోకి రానున్నాయని గత నెల 21న ‘ద హిందూ బిజినెస్‌లైన్‌’ ఒక కథనాన్ని ప్రచురించింది. అయితే, ఇటు కేంద్ర ప్రభుత్వం గానీ, అటు ఆర్బీఐగానీ ఈ కథానాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ అప్పుడు రూ. రెండువేల నోట్లు ముద్రణ అయ్యాయని, త్వరలోనే ప్రజల్లోకి రానున్నాయంటూ ఫేస్‌బుక్‌, వాట్సాప్‌లలో ఈ ఫొటోలు హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇవి నిజమైన నోట్లా? కాదా? అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement