సెన్సెక్స్ 245 పాయింట్ల జంప్
Published Thu, Jan 5 2017 4:08 PM | Last Updated on Tue, Sep 5 2017 12:30 AM
ముంబై: ప్రపంచ మార్కెట్ల జోష్తో సెన్సెక్స్ డబుల్ సెంచరీని క్రాస్ చేసింది. గురువారం ట్రేడింగ్లో సెన్సెక్స్ 245.11 పాయింట్ల లాభంతో 26878.24 వద్ద ముగియగా.. నిఫ్టీ తన కీలకమైన మార్కు 8,250ను అధిగమించి 8273.80గా నమోదైంది. అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీలు సెన్సెక్స్లో లాభాలు పండించగా.. టీసీఎస్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్లు నీరసించాయి. మెటల్, బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లో ముగిసినట్టు విశ్లేషకులు చెప్పారు.
నిఫ్టీ 50 స్టాక్స్ అన్నింటిల్లో టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. అమెరికాలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయాలు 30 శాతం ఎగియడంతో ఈ కంపెనీ స్టాక్స్ దాదాపు 4 శాతం మేర లాభాలను ఆర్జించాయి. వరుసగా ఎనిమిదో రోజు ఆసియన్ స్టాక్స్ లాభాల్లో ముగియడం కూడా దేశీయ ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా నిలిచింది. దీంతో మార్కెట్లకు మంచి కొనుగోలు మద్దతు లభించినట్టు తెలిసింది. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు చెరో 1 శాతం చొప్పున పెరిగాయి. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. 158 రూపాయల లాభంలో 10 గ్రాముల బంగారం ధర 27,840గా నమోదైంది.
Advertisement