Tata Motors up
-
సెన్సెక్స్ 245 పాయింట్ల జంప్
ముంబై: ప్రపంచ మార్కెట్ల జోష్‌తో సెన్సెక్స్ డబుల్ సెంచరీని క్రాస్ చేసింది. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 245.11 పాయింట్ల లాభంతో 26878.24 వద్ద ముగియగా.. నిఫ్టీ తన కీలకమైన మార్కు 8,250ను అధిగమించి 8273.80గా నమోదైంది. అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీలు సెన్సెక్స్‌లో లాభాలు పండించగా.. టీసీఎస్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌లు నీరసించాయి. మెటల్, బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లో ముగిసినట్టు విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ 50 స్టాక్స్ అన్నింటిల్లో టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. అమెరికాలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయాలు 30 శాతం ఎగియడంతో ఈ కంపెనీ స్టాక్స్ దాదాపు 4 శాతం మేర లాభాలను ఆర్జించాయి. వరుసగా ఎనిమిదో రోజు ఆసియన్ స్టాక్స్ లాభాల్లో ముగియడం కూడా దేశీయ ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా నిలిచింది. దీంతో మార్కెట్లకు మంచి కొనుగోలు మద్దతు లభించినట్టు తెలిసింది. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు చెరో 1 శాతం చొప్పున పెరిగాయి. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. 158 రూపాయల లాభంలో 10 గ్రాముల బంగారం ధర 27,840గా నమోదైంది. -
లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబై : సెప్టెంబర్ నెల డెరివేటివ్ సిరీస్ ప్రారంభం కావడంతో శుక్రవారం నాటి స్టాక్ మార్కెట్లు లాభాల్లో ఎంట్రీ ఇచ్చాయి. సెన్సెక్స్ 58.15 పాయింట్ల లాభంలో 27896.73గా, నిఫ్టీ 15.18 పాయింట్ల లాభంలో 8608గా ట్రేడ్ అవుతోంది. మరోవైపు రాత్రి ఫెడరల్ రిజర్వు చైర్పర్సన్ జానెట్ యెలెన్ చేయనున్న కీలక ప్రసంగంపై ఇన్వెస్టర్లు ఎక్కువగా దృష్టిసారించారు. ఈ ఏడాది సెప్టెంబర్ లేదా డిసెంబర్లలో రేట్లు పెంచవచ్చన్న సంకేతాల్ని ఈ సందర్భంగా యెలెన్ ఇస్తారన్న అంచనాలు ఇన్వెస్టర్లలో వున్నాయి. అటు ఆసియా మార్కెట్లు సైతం యెల్లన్ ప్రసంగ నేపథ్యంలో మిశ్రమంగా ట్రేడ్ అవుతున్నాయి. టాటా మోటార్స్ నేడు క్యూ1 ఫలితాను వెల్లడించనున్న క్రమంలో ఆ కంపెనీ షేర్లు 2 శాతం మేర లాభాల బాట పట్టాయి. అమెరికా రెగ్యులేటరీ నుంచి పారోక్సిటైన్ టాబ్లెట్ల ఎక్కువగా విడుదలకు లుపిన్కు అనుమతి లభించడంతో, ఆ కంపెనీ ఒక శాతం మేర లాభపడుతోంది. టాటామోటార్స్, ఆర్ఐఎల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఐటీసీ, మార్కెట్లో లాభాలకు దోహదం చేస్తున్నాయి. కోల్ ఇండియా, ఎస్బీఐ, ఏషియన్ పేయింట్స్, హెచ్‌డీఎఫ్‌సీలు సెన్సెక్స్‌లో లూజర్లుగా నిలుస్తున్నాయి. అటు డాలర్‌తో రూపాయి మారకం విలువ 0.04 పైసలు బలపడి 67.01గా ఉంది. ఎంసీఎక్స్ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర 118 రూపాయలు పడిపోయి 30,928గా నమోదవుతోంది.