Sensex gains
-
–1,207 నుంచి +843 పాయింట్లకు సెన్సెక్స్
ముంబై: ప్రారంభ నష్టాల నుంచి బలంగా పుంజుకున్న స్టాక్ సూచీలు శుక్రవారం భారీ లాభాలు నమోదుచేశాయి. టెలికం, ఐటీ, కన్జూమర్, ఎఫ్ఎంసీజీ షేర్లు ఇందుకు అండగా నిలిచాయి. దేశీయంగా ద్రవ్యోల్బణ దిగిరావడమూ కలిసొచ్చింది. ఇంట్రాడేలో 1,207 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్ అనూహ్యంగా రికవరీ అయ్యి చివరికి 843 పాయింట్ల లాభంతో 82,133 వద్ద నిలిచింది. నిఫ్టీ 220 పాయింట్లు పెరిగి 24,768 వద్ద స్థిరపడింది. మిశ్రమ అంతర్జాతీయ సంకేతాల ప్రభావంతో సూచీలు ఉదయం బలహీనంగా మొదలయ్యాయి. వీక్లీ ఎక్స్పైరీ ప్రభావంతో ప్రారంభంలో సెన్సెక్స్ 1,207 పాయింట్లు క్షీణించి 80,083 వద్ద, నిఫ్టీ 368 పాయింట్లు పతనమై 24,181 వద్ద కనిష్టాలకు దిగివచ్చాయి. అయితే ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో వడ్డీరేట్ల సంబంధిత షేర్లు ఫైనాన్స్, రియలీ్ట, ఆటో షేర్లు రాణించడంతో సూచీలు నష్టాల నుంచి గట్టెక్కాయి. మిడ్ సెషన్ నుంచి కొనుగోళ్ల తీవ్రత మరింత పెరగడంతో లాభాలు ఆర్జించగలిగాయి. ఒక దశలో సెన్సెక్స్ 924 పాయింట్లు పెరిగి 82,213 వద్ద, నిఫ్టీ 243 పాయింట్లు బలపడి 24,792 వద్ద గరిష్టాలు అందుకున్నాయి. మెటల్, సర్వీసెస్, కమోడిటీస్, ఇండ్రస్టియల్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్ క్యాప్ సూచీలు 0.29%, 0.08 శాతం చొప్పున నష్టపోయాయి. -
రెండోరోజూ మహా ర్యాలీ!
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం వహించిన మహాయుతి కూటమి ఆఖండ విజయంతో బుల్ రెండోరోజూ రంకెలేసింది. సెన్సెక్స్ 993 పాయింట్లు పెరిగి 80 వేల స్థాయిపైన 80,110 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 315 పాయింట్లు లాభపడి 24 వేల స్థాయిపైన 24,221 వద్ద నిలిచింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్ 1,076 పాయింట్లు బలపడి 80,193 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు ఎగసి 24,253 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 1,356 పాయింట్లు ఎగసి 80,473 వద్ద, నిఫ్టీ 445 పాయింట్లు దూసుకెళ్లి 24,352 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 84.29 స్థాయి వద్ద స్థిరపడింది. అమెరికా ఆర్థికమంత్రిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్, మార్కెట్‌కు అనుకూల ‘స్కాట్ బెసెంట్’ను ట్రంప్ నామినేట్ చేయడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్ మినహా అన్ని దేశాల సూచీలు 1.50% ర్యాలీ చేశాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒకశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. → సెన్సెక్స్ సూచీలో 30కి 26 షేర్లూ లాభాలతో ముగిశాయి. అత్యధికంగా ఎల్అండ్టీ, ఎస్బీఐ, అదానీ పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 4 – 2.50% లాభపడ్డాయి. బీఎస్ఈలో రంగాల వారీగా ఇండ్రస్టియల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, ఇంధన 2.50%, రియల్టీ, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ 2%, ఫార్మా సూచీలు ఒకశాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2% నుంచి ఒకటిన్నర శాతం పెరిగాయి. → అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మిశ్రమంగా స్పందించాయి. ఈ గ్రూప్‌లో పదింటికిగానూ అయిదు కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 2.55%, ఏసీసీ 2.54%, అదానీ ఎంటర్ప్రైజెస్ 1.26%, అదానీ విల్మార్ 2%, అంబుజా సిమెంట్స్ 1% లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 8%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4%, అదానీ పవర్ 3%, ఎన్డీటీవీ 2%, అదానీ టోటల్ గ్యాస్ 1.50% నష్టపోయాయి. → బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో చోటు దక్కించుకోవడంతో జొమాటో కంపెనీ షేరు 3.58% పెరిగి రూ.274 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 7.62% ఎగసి రూ.284 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదే సూచీలో స్థానం కోల్పోయిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు 2.5% నష్టపోయి రూ. 953 వద్ద ముగిసింది. గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 2,954 పాయింట్లు(4%) ర్యాలీ చేయడంతో రూ.14.20 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.439.58 లక్షల కోట్ల (5.22 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.6.11 లక్షల కోట్లు ఆర్జించారు. -
Stock Market: 75,000 @ రూ. 400 లక్షల కోట్లు
ఒక్క రోజు గ్యాప్‌లో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి దుమ్మురేపాయి. ప్రామాణిక ఇండెక్స్ సెన్సెక్స్ తొలిసారి 75,000 పాయింట్లపైన నిలవగా.. నిఫ్టీ 22,754 వద్ద ముగిసింది. వెరసి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ మళ్లీ రూ. 400 లక్షల కోట్లను అధిగమించింది. తాజా ట్రేడింగ్‌లో చిన్న షేర్లకు సైతం కొనుగోళ్ల మద్దతు లభించింది. అమెరికాలో ద్రవ్యోల్బణం మరోసారి కట్టుతప్పడంతో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆలోచనకు చెక్పడే వీలుంది. దీంతో యూఎస్ మార్కెట్లు 1.3 శాతం డీలాపడి ట్రేడవుతున్నాయి. ముంబై: ఇన్వెస్టర్లు అన్ని రంగాలలోనూ పెట్టుబడులకు ఆసక్తి చూపడంతో దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారంలో రెండోసారి సరికొత్త రికార్డులను సాధించాయి. సెన్సెక్స్ 354 పాయింట్లు జంప్‌చేసి మార్కెట్ చరిత్రలో తొలిసారి 75,038 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 111 పాయింట్ల వృద్ధితో కొత్త గరిష్టం 22,754 వద్ద ముగిసింది. ఇంట్రాడేలోనూ సెన్సెక్స్ 75,105 వద్ద, నిఫ్టీ 22,776 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. ఈ ప్రభావంతో బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్స్ సైతం 1–0.5 శాతం మధ్య బలపడ్డాయి. ఇన్వెస్టర్ల సంపదగా పిలిచే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ)కు రూ. 2,27,025 కోట్లు జమయ్యింది. మొత్తం విలువ రూ. 402 లక్షల కోట్ల(4.83 ట్రిలియన్ డాలర్లు) ఎగువకు చేరింది. ఫార్మా మినహా.. ఎన్ఎస్ఈలో ప్రధానంగా మీడియా, ప్రభుత్వ బ్యాంక్స్, చమురు, ఎఫ్ఎంసీజీ, మెటల్ 1.5 శాతంస్థాయిలో పుంజుకోగా.. ఫార్మా 0.3 శాతం నీరసించింది. నిఫ్టీ దిగ్గజాలలో కోల్ ఇండియా, బీపీసీఎల్, ఐటీసీ, కొటక్ బ్యాంక్, హిందాల్కో, ఎయిర్టెల్, ఎస్బీఐ, అదానీ ఎంటర్, ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, ఐషర్, టెక్ఎం, ఆర్ఐఎల్ 3.6–1% మధ్య లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ లైఫ్, సిప్లా, మారుతీ, దివీస్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2–1% మధ్య క్షీణించాయి. బీఎస్ఈలో మొత్తం ట్రేడైన షేర్లలో 1,904 లాభపడితే.. 1,939 బలహీనపడ్డాయి. నగదు విభాగంలో ఎఫ్‌పీఐలు రూ. 2,778 కోట్లు, దేశీ ఫండ్స్ సైతం రూ. 163 కోట్ల చొప్పున ఇన్వెస్ట్ చేశాయి. మూడోరోజూ మెరిసిన పసిడి, వెండి పసిడి, వెండి ధరలు న్యూఢిల్లీలో వరుసగా మూడవ రోజు బుధవారం కూడా రికార్డుల ర్యాలీ చేశాయి. పసిడి పూర్తి స్వచ్ఛత 10 గ్రాముల ధర ఒక దశలో లైఫ్‌టైమ్ హై రూ.72,000 తాకింది. అటు తర్వాత క్రితం ముగింపుతో పోలి్చతే రూ.200 లాభంతో రికార్డు స్థాయి రూ.71,840 వద్ద ముగిసింది. వెండి కూడా కేజీకి రూ.200 ఎగసి రూ.84,700 వద్ద ముగిసింది. పసిడి ధర గడచిన మూడు రోజుల్లో రూ.690 పెరగ్గా, వెండి ధర ఇదే కాలంలో రూ.1,500 పెరిగింది. కాగా, అంతర్జాతీయ బులిష్ ధోరణులు ఈ రెండు మెటల్స్ తాజా పెరుగుదలకు కారణంకాగా, బుధవారం వెలువడిన అమెరికాలో తీవ్ర ద్రవ్యోల్బణం గణాంకాలు, వడ్డీరేట్లు తగ్గకపోవచ్చని భయాలతో బంగారం, వెండి తక్షణ ర్యాలీకి బ్రేక్ పడవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. అంతర్జాతీయంగా, జాతీయంగా ఫ్యూచర్స్ మార్కెట్లు క్రితం ముగింపుతో పోల్చితే మైనస్‌లో ట్రేడవుతుండడం ఇక్కడ గమనార్హం. నకిలీ వీడియోలతో తస్మాత్ జాగ్రత్త! ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవో ఆశిష్ కుమార్ చౌహాన్ స్టాక్ రికమండేషన్లు ఇస్తున్నట్లు అవాస్తవ(డీప్‌ఫేక్) వీడియోల సృష్టి జరిగినట్లు స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజం తాజాగా పేర్కొంది. ఆధునిక సాంకేతికతను తప్పుడు మార్గంలో వినియోగించడం ద్వారా ఎన్ఎస్ఈ లోగోసహా.. ఆశిష్‌కుమార్ ముఖం లేదా గొంతుతో షేర్ల సిఫారసులు చేస్తున్న ఫేక్ వీడియోలను నమ్మొద్దని హెచ్చరించింది. -
స్టాక్స్ బుల్ సవారీ
ముంబై: ప్రధానంగా బ్లూచిప్స్‌లో కొనుగోళ్లతో దేశీ స్టాక్ మార్కెట్లు మరోసారి హైజంప్ చేశాయి. వెరసి ప్రామాణిక ఇండెక్సులు సరికొత్త గరిష్టాలకు చేరాయి. సెన్సెక్స్ 494 పాయింట్లు ఎగసి 74,742 వద్ద ముగిసింది. నిఫ్టీ 153 పాయింట్లు జమ చేసుకుని 22,666 వద్ద స్థిరపడింది. ఒక దశలో సెన్సెక్స్ 621 పాయింట్లు పురోగమించి 74,869ను తాకింది. ఇక నిఫ్టీ 183 పాయింట్లు బలపడి 22,697 వద్ద గరిష్టాన్ని అందుకుంది. ప్రపంచ స్టాక్ మార్కెట్ల ర్యాలీ సెంటిమెంటుకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. వారాంతాన యూఎస్ మార్కెట్లు లాభపడిన సంగతి తెలిసిందే. . మార్కెట్ విలువ రికార్డ్ ఇన్వెస్టర్ల సంపదగా పేర్కొనే బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్(విలువ) తొలి సెషన్లో రూ. 401 లక్షల కోట్లను అధిగమించింది. మార్కెట్ చరిత్రలో ఇది తొలిసారికాగా.. డాలర్లలో 4.81 ట్రిలియన్లను తాకింది. చివరికి బీఎస్ఈ మార్కెట్ విలువ రూ. 4,00,86,722 వద్ద స్థిరపడింది. గతేడాది జులైలో తొలిసారి బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల విలువ రూ. 300 లక్షల కోట్లను తాకిన విషయం విదితమే. బ్లూచిప్స్ దన్ను ఎన్ఎస్ఈలో ప్రధానంగా ఆటో, ఆయిల్, రియల్టీ, మెటల్ రంగాలు 2.2–1.2 శాతం మధ్య పుంజుకోగా.. పీఎస్‌యూ బ్యాంక్స్, మీడియా, ఐటీ 0.5 శాతం స్థాయిలో బలహీనపడ్డాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఐషర్, ఎంఅండ్ఎం, మారుతీ, ఎన్టీపీసీ, ఎస్బీఐ లైఫ్, జేఎస్‌డబ్ల్యూ, గ్రాసిమ్, టాటా కన్జూమర్, ఎల్అండ్టీ, ఆర్ఐఎల్, యాక్సిస్, హీరోమోటో, ఎయిర్టెల్ 4–1 శాతం మధ్య ఎగశాయి. అయితే అదానీ పోర్ట్స్, నెస్లే, అపోలో హాస్పిటల్, విప్రో, సన్ ఫార్మా 1.6–0.6 శాతం మధ్య నీరసించాయి. ఆధార్ హౌసింగ్ ఐపీవోకు రెడీ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. ఇందుకు సెబీ గ్రీన్‌సిగ్నల్ ఇచి్చంది. ఐపీవో ద్వారా రూ. 5,000 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉంది. మే 20న మార్కెట్లకు సెలవు ముంబైలో సాధారణ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో మే 20న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలకు సెలవు ప్రకటించారు. ఈ నెల 11న ఈద్(రంజాన్), 17న శ్రీరామ నవమి, మే 1న మహారాష్ట్ర డే సందర్భంగా సైతం స్టాక్ మార్కెట్లు పనిచేయవు. -
బుల్ బ్యాక్ ర్యాలీ
ముంబై: ప్రోత్సాహకర స్థూల ఆర్థిక గణాంకాల నమోదుతో బ్యాంకింగ్, ఆటో, ఆయిల్‌అండ్‌గ్యాస్ షేర్లలో కొనుగోళ్లు వెల్లువెత్తాయి. ఫలితంగా బుధవారం సెన్సెక్స్ 526 పాయింట్లు పెరిగి 72,996 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 119 పాయింట్లు బలపడి 22,100 స్థాయిపైన 22,124 వద్ద నిలిచింది. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్(1%), రిలయన్స్ ఇండస్ట్రీస్(4%), మారుతీ సుజుకీ(2%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు అందడంతో సూచీలు ఉదయం స్వల్ప లాభాలతో మొదలయ్యాయి. రోజంతా లాభాలే.. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో రోజంతా లాభాల్లో కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 668 పాయింట్లు బలపడి 73,139 వద్ద, నిఫ్టీ 188 పాయింట్లు ఎగసి 22,193 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. మళ్లీ రూ.20 లక్షల కోట్లపైకి రిలయన్స్ మార్కెట్ క్యాప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ షేరు 3.60% లాభపడి రూ.2988 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ రేటింగ్ సంస్థ గోల్డ్‌మెన్ శాక్స్ రిలయన్స్ కంపెనీ షేరు టార్గెట్ ధరను పెంచడంతో పాటు క్రూడాయిల్ ధరలు దిగిరావడం ఈ షేరుకు డిమాండ్ లభించింది. ట్రేడింగ్‌లో 4% లాభపడి రూ.3000 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకుంది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.70,039 కోట్లు పెరిగి రూ.20.21 లక్షల కోట్ల వద్ద స్థిరపడింది. ఈ ఫిబ్రవరి 13న కంపెనీ రిలయన్స్ క్యాప్ రూ.20 లక్షల కోట్ల స్థాయిని అందుకుంది. దేశంలో టాప్–5 మార్కెట్ క్యాప్ కలిగిన సంస్థల్లో రిలయన్స్ అగ్రస్థానంలో నిలవగా.., టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ► జ్యువెలరీ రిటైల్ కంపెనీ పీఎన్ గాడ్గిల్ జ్యువెలర్స్ పబ్లిక్ ఇష్యూ బాటలో సాగుతోంది. సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ► బజాజ్ ఫైనాన్స్‌కు చెందిన బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ పబ్లిక్ ఇష్యూకి రానుంది. తద్వారా కంపెనీ 10 బిలియన్ డాలర్ల(రూ. 83,000 కోట్లు) సమీకరించే యోచనలో ఉన్నట్లు సమాచారం. ► మారుతీ సుజుకీ రూ.12,256 జీవిత కాల గరిష్టాన్ని తాకింది. దీనితో ఇంట్రాడేలో మార్కెట్ క్యాప్ రూ.4 లక్షల కోట్లను అందుకుంది. -
ఐటీ, ఇంధన షేర్లకు డిమాండ్
ముంబై: ఐటీ, ఇంధన కంపెనీల షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు మంగళవారం దాదాపు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు సెంటిమెంట్‌ను బలపరిచాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరిగి 72,186 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 158 పాయింట్లు బలపడి 21,929 వద్ద నిలిచింది. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 530 పాయింట్లు పెరిగి 72,261 వద్ద, నిఫ్టీ 179 పాయింట్లు బలపడి 72,261 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకశాతానికి పైగా రాణించాయి. సెన్సెక్స్ 455 పాయింట్లు పెరగడంతో బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలోని నమోదిత కంపెనీల మార్కెట్ల విలువ రూ.4.27 లక్షల కోట్లు పెరిగి రూ.386.88 లక్షల కోట్లకు చేరింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.93 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1096 కోట్ల విలువైన షేర్లను కొన్నారు. ఆసియాలో హాంగ్‌కాంగ్ 4%, చైనా 3%, థాయిలాండ్ 1%, ఇండోనేసియా, తైవాన్ సూచీలు అరశాతం చొప్పున పెరిగాయి. యూరప్ మార్కెట్లు 0.50% – 0.75% చొప్పున లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. ► వరుస 3 రోజుల్లో 42% పతనాన్ని చవిచూసిన పేటీఎం షేరు కోలుకుంది. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈలో 3% లాభపడి రూ.452 వద్ద స్థిరపడింది. ► టీసీఎస్ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.15 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ఐటీ షేర్లలో ర్యాలీలో భాగంగా టీసీఎస్ షేరు ట్రేడింగ్‌లో 4.5% ర్యాలీ చేసి రూ.4,150 వద్ద జీవితకాల గరిష్టాన్ని అందుకుంది. చివరికి 4% లాభపడి రూ.4,133 వద్ద స్థిరపడింది. -
ఆరంభ లాభాలు ఆవిరి
ముంబై: గరిష్ట స్థాయిల వద్ద ఆఖరి గంటలో లాభాల స్వీకరణ చోటుచేసుకోవడంతో స్టాక్ సూచీలు మంగళవారం ఆరంభంలో ఆర్జించిన భారీ లాభాలను కోల్పోయి స్వల్పలాభాలతో గట్టెక్కాయి. ఇంట్రాడేలో 680 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ చివరికి 31 పాయింట్ల స్వల్ప లాభంతో 71,386 వద్ద నిలిచింది. నిఫ్టీ ట్రేడింగ్‌లో 211 పాయింట్లు ఆర్జించింది. ఆఖరికి 32 పాయింట్లు్ల పెరిగి 21,545 వద్ద నిలిచింది. ఉదయం లాభాలతో మొదలైన సూచీలు మధ్యాహ్నం వరకు స్థిరమైన లాభాలతో ముందుకు కదిలాయి. అయితే ఆఖరి గంటన్నరలో అమ్మకాలు వెల్లువెత్తడంతో ఇంట్రాడే గరిష్టం నుంచి దాదాపు ఒక శాతం దిగివచ్చాయి. బ్యాంకింగ్, మీడియా, ఎఫ్ఎంసీజీ, సర్విసెస్ రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఆటో, మెటల్, ఐటీ, ఫార్మా, రియల్టీ, ఇంధన షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. చిన్న తరహా షేర్లకు డిమాండ్ లభించడంతో బీఎస్ఈ స్మాల్ క్యాప్ సూచీ 0.37% లాభపడింది. విదేశీ ఇన్వెస్టర్లు రూ.991 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.104 కోట్ల షేర్లను కొన్నారు. ఆసియాలో జపాన్ (1%), సింగపూర్ (0.50%), చైనా (0.20%) మినహా మిగిలిన అన్ని దేశాల స్టాక్ సూచీలు అరశాతం మేర నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు అరశాతానికి పైగా పతనమయ్యాయి. అమెరికా మార్కెట్లు స్వల్ప నష్టాల్లో ట్రేడవుతున్నాయి. అధిక వాల్యుయేషన్ ఆందోళనలు, ఆసియా మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు మన మార్కెట్లో లాభాల స్వీకరణకు పురిగొల్పాయని జియోజిత్ ఫైనాన్సియల్ సర్విసెస్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ► సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియాతో 10 బిలియన్ డాలర్ల విలీనంపై సందిగ్ధత నెలకొనడంతో జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ షేరు 8% పతనమైన రూ.256 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 13% క్షీణించి రూ.242 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. షేరు భారీ పతనంతో కంపెనీ మార్కెట్ విలువ రూ.2,036 కోట్లు నష్టపోయి రూ.24,613 కోట్లకు దిగివచ్చింది. ► బజాజ్ ఆటో రూ.4,000 కోట్ల బైబ్యాక్ ప్రకటించడంతో కంపెనీ షేరు 2% పెరిగి రూ.7,094 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 6% ఎగసి రూ.7,420 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో సంస్థ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2 లక్షల కోట్ల మైలురాయిని అధిగమించింది. ► జ్యోతి సీఎన్సీ ఆటోమేషన్ ఐపీఓకు తొలి రోజు విశేష స్పందన లభించింది. ఇష్యూ ప్రారంభమైన తొలి కొన్ని గంటల్లోనే షేర్లు పూర్తిగా సబ్‌స్క్రైబ్ అయ్యాయి. పబ్లిక్ ఇష్యూలో భాగంగా కంపెనీ మొత్తం 1.75 కోట్ల షేర్లను విక్రయానికి ఉంచగా 4.40 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. మొత్తంగా మొదటి రోజే 2.51 రెట్ల ఓవర్ సబ్‌స్రై్కబ్ అయ్యింది. ఇందులో రిటైల్ విభాగం 8.25 రెట్లు, సంస్థాగతేతర ఇన్వెస్టర్ల విభాగం 3.63 రెట్లు, క్యూఐబీ కోటా 2 రెట్లు సబ్‌స్రై్కబ్ అయ్యాయి. -
మెటల్, ఇంధన షేర్లలో కొనుగోళ్లు
ముంబై: మెటల్, ఇంధన, యుటిలిటీ, విద్యుత్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్ సూచీలు మంగళవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 230 పాయింట్లు పెరిగి 71,337 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 92 పాయింట్లుబలపడి 21,441 వద్ద నిలిచింది. ఇరు సూచీలకిది మూడోరోజూ లాభాల ముగింపు. వరుస సెలవుల తర్వాత ఉదయం దేశీయ మార్కెట్ ఫ్లాట్‌గా మొదలయ్యాయి. అయితే ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు క్రమంగా లాభాల దిశగా కదిలాయి. ఒక దశలో సెన్సెక్స్ 364 పాయింట్లు పెరిగి 71,471 వద్ద, నిఫ్టీ 128 పాయింట్లు బలపడి 71,471 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. ఐటీ, టెక్, ప్రభుత్వరంగ బ్యాంకుల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు అరశాతం చొప్పున రాణించాయి. బాక్సింగ్ డే సందర్భంగా యూరప్ మార్కెట్లు పనిచేయలేదు. అమెరికా సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడవుతున్నాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,636 కోట్ల షేర్లను విక్రయించారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1,464 కోట్ల షేర్లను కొన్నారు. అధిక వెయిటేజీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.75%), రిలయన్స్ (0.50%), కోటక్ బ్యాంక్ (1.35%) షేర్లు రాణించి సూచీలకు దన్నుగా నిలిచాయి. మోటిసన్స్ లిస్టింగ్ భళా మోటిసన్స్ జ్యువెలరీ లిస్టింగ్ రోజునే ఇన్వెస్టర్లకు లాభాలను పంచింది. ఇష్యూ ధర రూ. 55తో పోలిస్తే బీఎస్ఈలో ఏకంగా 89 శాతం ప్రీమియంతో రూ. 104 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. ఆపై ఒక దశలో 98 శాతంపైగా దూసుకెళ్లి గరిష్టంగా రూ. 109ను అధిగమించింది. చివరికి 84 శాతం లాభంతో రూ. 101 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలోనూ 98 శాతం జంప్‌చేసి రూ. 109 వద్ద లిస్టయ్యింది. ఆపై దాదాపు రూ. 110 వద్ద గరిష్టానికి చేరింది. చివరికి 88 శాతంపైగా వృద్ధితో రూ. 104 వద్ద స్థిరపడింది. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 996 కోట్లుగా నమోదైంది. ఐపీవో ద్వారా కంపెనీ రూ. 151 కోట్లు సమకూర్చుకున్న విషయం విదితమే. -
3 రోజుల నష్టాలకు చెక్
ముంబై: అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల రికవరీ, క్రూడాయిల్ ధరలు దిగిరావడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్ 3 రోజుల నష్టాల నుంచి గట్టెక్కింది. సెన్సెక్స్ 261 పాయింట్లు పెరిగి 66,428 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 పాయింట్లు పెరిగి 19,812 వద్ద నిలిచింది. ఉదయం సూచీలు లాభాలతో మొదలయ్యాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో రోజంతా లాభాల్లోనే కదలాడాయి. ఒక దశలో సెన్సెక్స్ 393 పాయింట్లు పెరిగి 66,560 వద్ద, నిఫ్టీ 118 పాయింట్లు బలపడి 19,850 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. అయితే చివర్లో పలు రంగాల్లో లాభాల స్వీకరణతో స్వల్పంగా లాభాలు కోల్పోయాయి. బీఎస్ఈ స్మాల్, మిడ్‌క్యాప్ సూచీలు వరుసగా 0.70%, 0,40% చొప్పున పెరిగాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.264 కోట్లు, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.113 కోట్ల షేర్లు కొన్నారు. సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు, అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఆశావహన అంచనాలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్నాయి సెప్టెంబర్ క్వార్టర్లో మెరుగైన ఫలితాలను ప్రకటించడంతో సియట్ లిమిటెడ్ షేరు 4.50% లాభపడి రూ.2,197 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 11% దూసుకెళ్లి రూ.2,334 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. గతేడాది క్యూ2 సంస్థ నికర లాభం రూ.6.4 కోట్లుగా ఉంది. షేరు భారీ ర్యాలీతో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.388 కోట్లు పెరిగి రూ. 8,887 కోట్లకు చేరింది. కల్యాణ్ జ్యువెల్లర్స్ కంపెనీ షేరు 4.09% లాభపడి రూ.295 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో 5% పెరిగి రూ.298 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ఈ క్రమంలో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.30,000 కోట్ల మైలురాయిని అధిగమించి రూ.30,422 కోట్లకు చేరింది. కాగా ఈ ఏడాది ఇప్పటివరకు కంపెనీ షేరు 133% దూసుకెళ్లింది. రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర పనితీరు కనబరచడంతో హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేరు 1% పెరిగి రూ.1,541 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 2% ర్యాలీ చేసి రూ.1,558 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ఎల్రక్టానిక్ సేవల తయారీ సంస్థ సైయెంట్ డీఎల్ఎం షేరు 3% ఎగసి రూ.709 వద్ద స్థిరపడింది. క్యూ2 లో కంపెనీ నికర లాభం 106% వృద్ధి చెందడం షేరు ర్యాలీకి కారణమైంది. ట్రేడింగ్‌లో 8.50% ఎగసి రూ.748 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
బడ్జెట్ నష్టాలు భర్తీ
కరోనా వైరస్ మరింత ముదరకుండా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయన్న భరోసాతో ప్రపంచ మార్కెట్లు కోలుకోవడం, ముడిచమురు ధరలు 13 నెలల కనిష్టానికి పడిపోవడంతో స్టాక్ మార్కెట్ మంగళవారం భారీగా లాభపడింది. సెన్సెక్స్ 40,000 పాయింట్లపైకి ఎగియగా, నిఫ్టీ 12,000 పాయింట్లకు 20 పాయింట్ల దూరంలో నిలిచింది. వరుసగా రెండో రోజూ సెన్సెక్స్, నిఫ్టీలు లాభపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం పుంజుకోవడం, బ్లూచిప్ షేర్లలో వేల్యూ, షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకోవడం సానుకూల ప్రభావం చూపించింది. బీఎస్ఈ సెన్సెక్స్ 917 పాయింట్లు ఎగసి 40,789 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 272 పాయింట్లు పెరిగి 11,980 పాయింట్ల వద్ద ముగిశాయి. శాతం పరంగా చూస్తే, సెన్సెక్స్ 2.3 శాతం, నిఫ్టీ 2.32 శాతం చొప్పున పెరిగాయి. గత నాలుగు నెలల్లో సెన్సెక్స్, నిఫ్టీ ఈ రేంజ్లో లాభపడటం ఇదే మొదటిసారి. అన్ని రంగాల సూచీలు లాభాల్లోనే ముగిశాయి. బడ్జెట్ నిరాశ నుంచి బయటకు... వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఉద్దేశించిన కేంద్ర బడ్జెట్ అంచనాలను అందుకోలేకపోవడంతో గత శనివారం జరిగిన ప్రత్యేక ట్రేడింగ్‌లో సెన్సెక్స్, నిఫ్టీలు భారీగా పతనమైన విషయం తెలిసిందే. బడ్జెట్ రోజున సెన్సెక్స్ 988 పాయింట్లు, నిఫ్టీ 300 పాయింట్ల మేర నష్టపోయాయి. మొత్తం మీద గత వారంలో ఈ సూచీలు 4.5 శాతం మేర నష్టపోయాయి. ఈ నష్టాలన్నింటినీ ఈ సూచీలు మంగళవారం భర్తీ చేసుకున్నాయని, మళ్లీ బడ్జెట్ ముందటి స్థాయికి చేరుకున్నాయని విశ్లేషకులు పేర్కొన్నారు. బడ్జెట్ నిరాశ నుంచి ఇన్వెస్టర్లు తేరుకున్నారని, మార్కెట్‌ను నడిపించే కంపెనీల క్యూ3 ఫలితాలు, ఆర్థిక గణాంకాలపై దృష్టి సారిస్తున్నారని వారంటున్నారు. మరిన్ని విశేషాలు.... ►ఆర్థిక ఫలితాలు బాగా ఉండటంతో టైటాన్ కంపెనీ షేరు 8 శాతం లాభంతో రూ.1,276 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. ►మొత్తం 30 సెన్సెక్స్ షేర్లలో రెండు షేర్లు–బజాజ్ ఆటో, హిందుస్తాన్ యూనిలివర్ మాత్రమే నష్టపోయాయి. మిగిలిన 28 షేర్లు లాభాల్లో ముగిశాయి. ►దాదాపు వందకు పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. వీటిలో సగం షేర్లు ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. ఆఫిల్ ఇండియా, ఐఆర్సీటీసీ, ఇండి యామార్ట్ ఇంటర్మెష్, గోద్రేజ్ ప్రాపర్టీస్, హనీవెల్ ఆటోమేషన్, ఇన్ఫోఎడ్జ్ ఇండియా, ఏషియన్ పెయింట్స్, బజాజ్ ఫైనా న్స్, బాటా ఇండియా, బెర్జర్ పెయింట్స్, డాబర్ ఇండియా, హెచ్‌యూఎల్, పీవీఆర్, రిలాక్సో ఫుట్‌వేర్, శ్రీ సిమెంట్, ఎస్ఆర్ఎఫ్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. రెండు రోజుల్లో రూ.3.57 లక్షల కోట్లు పెరిగిన సంపద స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా 2 రోజుల్లో ఇన్వెస్టర్ల సంపద రూ.3.57 లక్షల కోట్లు ఎగసింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.3,57,044 కోట్లు పెరిగి రూ.156.62 లక్షల కోట్లకు చేరింది. ఒక్క మంగళవారం రోజే ఇన్వెస్టర్ల సంపద రూ.2.79 లక్షల కోట్లు ఎగబాకింది. మార్కెట్ జోరు ఎందుకంటే... ►కరోనా నుంచి కోలుకుంటున్న మార్కెట్లు... కరోనా వైరస్ కట్టడికి గట్టి ప్రయత్నాలే జరుగుతుండటంతో ప్రపంచ మార్కెట్లు కోలుకున్నాయి. మరోవైపు మందగమనాన్ని తట్టుకోవడానికి చైనా కేంద్ర బ్యాంక్ భారీగా నిధులను(17,300 కోట్ల డాలర్లు) విడుదల చేయాలని నిర్ణయించడం కూడా ప్రపం చ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపించింది. సోమవారం 7% పతనమైన షాంఘై సూచీ మంగళవారం 1.3 % పుంజుకుంది. జపాన్ నికాయ్, హాంకాంగ్ హాంగ్‌సెంగ్, దక్షిణ కొరియా కోస్పి సూచీలు 0.5%–1.8 శాతం మేర లాభపడ్డాయి. యూరప్ మార్కెట్లు కూడా లాభాల్లోనే ముగిశాయి. ఇక డౌజోన్స్ ఫ్యూచర్స్ కూడా 300 పాయింట్ల మేర ర్యాలీ జరిపింది. ►దిగి వస్తున్న చమురు ధరలు... కరోనా వైరస్ భయాలతో వృద్ధి మందగిస్తుందని, ఫలితంగా చమురుకు డిమాండ్ పడిపోతుందనే ఆందోళనతో ముడి చమురు ధరలు క్షీణిస్తున్నాయి. జనవరి గరిష్ట స్థాయి నుంచి చూస్తే, బ్రెంట్ ముడిచమురు ధర దాదాపు 10 డాలర్లు పతనమైంది. చమురు ధరలు 20% పైగా తగ్గాయి. మూడొంతులకు పైగా ముడి చమురును దిగుమతి చేసుకుంటున్న మన దేశానికి చమురు ధరలు తగ్గడం చాలా మేలు చేస్తుంది. ►డివిడెండ్ షేర్ల జోరు... ఏప్రిల్ 1 తర్వాత డివిడెండ్ ఇస్తే, కంపెనీ ప్రమోటర్లు దాదాపు 40% డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ (డీడీటీ) చెల్లించాల్సి వస్తుందని అంచనా. ఈ భారాన్ని తప్పించుకునేందుకు పలు కంపెనీలు ఈ ఏడాది మార్చిలోపే డివిడెండ్‌ను ఇస్తాయనే అంచనాలతో డివిడెండ్ చెల్లించే షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. ►బడ్జెట్ బాగా లేకపోయినా... బడ్జెట్ అంచనాలకు అనుగుణంగా లేకపోయినా, మరీ అధ్వానంగా అయితే లేదని, దీర్ఘకాలంలో వృద్ధికి తోడ్పడే విధంగానే ఉందని ఇన్వెస్టర్లు మెల్లగా గ్రహిస్తున్నారని నిపుణులంటున్నారు. కార్పొరేట్ బాండ్లలో విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల పరిమితిని 9 శాతం నుంచి 15 శాతానికి పెంచడం, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ భారాన్ని కంపెనీలపై తొలగించడం తదితర కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భారత్ మరింత ఆకర్షణీయంగా అవతరించిందని వారంటున్నారు. అందుకే కొనుగోళ్లు జోరుగా జరిగాయని వారంటున్నారు. ►షార్ట్ కవరింగ్, వేల్యూ బయింగ్ కొనుగోళ్లు శనివారం నాటి భారీ పతనం కారణంగా పలు బ్లూచిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభ్యమవుతుండటంతో వేల్యూ బయింగ్ చోటుచేసుకుంది. మరోవైపు షార్ట్ పొజిషన్లను కవర్ చేసుకునేందుకు ట్రేడర్లు షార్ట్ కవరింగ్‌కు దిగడం కూడా కలసివచ్చింది. ►ఎనిమిదేళ్ల గరిష్టానికి తయారీ రంగ పీఎమ్ఐ ఈ ఏడాది జనవరి నెలలో తయారీ రంగ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎమ్ఐ) ఎనిమిదేళ్ల గరిష్టానికి ఎగసింది. ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందనడానికి ఇదే నిదర్శనమని భావించి ఇన్వెస్టర్లు జోరుగా కొనుగోళ్లు జరిపారు. ►పుంజుకున్న రూపాయి... డాలర్‌తో రూపాయి మారకం విలువ పెరిగింది. 11 పైసలు పుంజుకొని 71.27కు చేరింది. ►గణాంకాల, ఫలితాల ప్రోత్సాహం... జనవరి వాహన విక్రయ గణాంకాలు ఒకింత ప్రోత్సాహకరంగానే ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీల క్యూ3 ఫలితాలు మరీ నిరాశమయంగా కాకుండా ఒకింత మెరుగ్గానే ఉన్నాయి. -
ఒడిదుడుకులు... అయినా లాభాల్లోనే!!
ముంబై: దేశీయ ప్రధాన స్టాక్ సూచీలు సోమవారం స్వల్ప లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఉదయం సెన్సెక్స్ 65 పాయింట్ల లాభంతో 40,510 వద్ద ప్రారంభమైంది. ఆ తరువాత కొనసాగిన లాభాల స్వీకరణతో కనిష్టంగా 40,337 పాయింట్లకు పడిపోయింది. మధ్యాహ్నం మళ్లీ కోలుకుని గరిష్టంగా 40,646 పాయింట్లకు చేరినప్పటికీ.. నిరాశపరిచిన ఇటీవలి క్యూ2 జీడీపీ గణాంకాల నేపథ్యంలో ప్రీమియం వాల్యుయేషన్స్ వద్ద మార్కెట్ నిలబడే అవకాశాలు అంతంత మాత్రంగా ఉన్నాయనే అనుమానాలు లాభాల స్వీకరణకు కారణమయ్యాయి. సెన్సెక్స్ 42 పాయింట్ల లాభంతో 40,487 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల లాభంతో 11,937 వద్ద ముగిశాయి. 7.5 శాతం పెరిగిన వీఐఎక్స్ మార్కెట్లో రానున్న 30 రోజుల ఒడిదుడుకులను ప్రతిబింబించే ఇండియా వీఐఎక్స్ సూచీ సోమవారం ఒక్కసారిగా 7.5 శాతం పెరిగి 14.59 స్థాయికి చేరుకుంది. ఈ సూచీ కదలికల ఆధారంగా రానున్న రోజుల్లో ఒడిదుడుకులకు మరింత ఆస్కారం ఉందని రిలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ వీపీ అజిత్ మిశ్రా విశ్లేíషించారు. బలపడిన రూపాయి.. ఐటీ షేర్లు డీలా డాలరుతో రూపాయి బలపడిన కారణంగా నిఫ్టీ ఐటీ 0.87 శాతం నష్టపోయింది. ఈ సూచీలోని టీసీఎస్ షేరు అత్యధికంగా 2.99 శాతం నష్టపోగా.. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 1.62 శాతం, టెక్ మహీంద్ర 0.86 శాతం నష్టపోయాయి. మరోవైపు హెక్సావేర్, ఎన్ఐఐటీ షేర్లు ఒక శాతం లాభపడ్డాయి. నిఫ్టీ ఆటో 0.73 శాతం లాభం.. మారుతీ సుజుకీ నవంబర్‌లో వాహనాల ఉత్పత్తిని 4.33 శాతం పెంచినట్లు ప్రకటించిన నేపథ్యంలో ఈ కంపెనీ షేరు 2 శాతం మేర లాభపడింది. ఈ సానుకూల అంశంతో ఆటో షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ఎంఆర్ఎఫ్, ఆశోక్ లేలాండ్, ఎం అండ్ ఎం, హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో షేర్లు 0.45 శాతం నుంచి 1.41 శాతం మధ్యలో లాభపడ్డాయి. వోడాఫోన్ ఐడియా 5.80 శాతం డౌన్ ప్రభుత్వ సాయం లేకపోతే వ్యాపారాన్ని మూసివేస్తామని వోడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా చేసిన వ్యాఖ్యలతో ఈ కంపెనీ షేరు 5.8 శాతం నష్టంతో రూ. 6.50 వద్ద ముగిసింది. ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ 4.75 శాతం నష్టపోగా.. పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ 7.88 శాతం నష్టపోయింది. డిష్ టీవీ 6.37 శాతం అప్ అంతర్గత సమీకరణల ద్వారా తన అప్పులలో అధిక భాగాన్ని చెల్లిస్తామని డిష్ టీవీ ప్రకటించటంతో ఈ కంపెనీ షేరు 6.37 శాతం లాభపడింది. ఆకర్షణీయ రెవెన్యూ గైడెన్స్‌తో వా టెక్ వాబాగ్ 15.38 శాతం లాభపడింది. కాగా నిఫ్టీ–50 షేర్లలో బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఆదాని పోర్ట్స్, హెచ్డీఎఫ్సీ అత్యధికంగా 2 శాతం మేర లాభపడ్డాయి. -
–459 నుంచి +180 దాకా
ఆరంభంలో వచ్చిన భారీ నష్టాలను రికవరీ చేసుకొని బుధవారం స్టాక్ మార్కెట్ లాభాల్లో ముగిసింది. దీంతో వరుస మూడు ట్రేడింగ్ సెషన్ల నష్టాలకు బ్రేక్ పడింది. క్రిస్మస్ సెలవు కారణంగా మంగళవారం మార్కెట్ పనిచేయలేదు. ఒక రోజు విరామం తర్వాత ఆరంభమైన స్టాక్ సూచీలు ప్రారంభంలో భారీగా నష్టపోయాయి. అయితే ఆర్థిక రంగ షేర్లు కోలుకోవడం, అమెరికా ఫ్యూచర్స్ లాభపడటం, డిసెంబర్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు మరో రెండు రోజుల్లో ముగియనుండటంతో కొన్ని షేర్లలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటుచేసుకోవడం, రూపాయి లాభపడటం కలసివచ్చాయి. హెచ్డీఎఫ్సీ ద్వయం, ఎల్ అండ్ టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి బ్లూచిప్ షేర్లలో వేల్యూ బయింగ్ చోటు చేసుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ మళ్లీ 10,700 పాయింట్లపైకి ఎగబాకింది. 66 పాయింట్లు పెరిగి 10,730 పాయింట్ల వద్ద ముగిసింది. బీఎస్ఈ సెన్సెక్స్ 180 పాయింట్లు లాభపడి 35,650 పాయింట్ల వద్దకు చేరింది.ఆర్థిక, ఎఫ్ఎమ్సీజీ రంగ షేర్లు లాభపడ్డాయి. ఫార్మా, ఐటీ షేర్లు తగ్గాయి. నష్టాలతో మొదలై.. బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్లు, నిఫ్టీ 29 పాయింట్ల నష్టాలతో బుధవారం ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలు నెలకొన్న నేపథ్యంలో అమెరికాలో పాక్షిక షట్‌డౌన్, అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ పావెల్‌కు వ్యతిరేకంగా ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ శతృ వైఖరి అవలంభించడం వంటి కారణాల వల్ల అమ్మకాలు వెల్లువెత్తాయి. దీంతో స్టాక్ సూచీలు భారీగా నష్టపోయాయి. ఒక దశలో కీలకమైన స్థాయిలనూ కోల్పోయాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 459 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిప్టీ 129 పాయింట్ల వరకూ పతనమయ్యాయి. రూపాయితో డాలర్ మారకం పెరగడం సానుకూల ప్రభావం చూపించింది. అమెరికా ఎస్ అండ్ పీ, డోజోన్స్ 30 ఫ్యూచర్స్ రికవరీ కావడం, దీనికి షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు జత కావడంతో మన మార్కెట్ కూడా రికవరీ బాట పట్టింది. ఒక దశలో సెన్సెక్స్ 241 పాయింట్లు, నిఫ్టీ 84 పాయింట్ల వరకూ ఎగిశాయి. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్ 700 పాయింట్లు, నిఫ్టీ 213 పాయింట్ల రేంజ్లో కదలాడాయి. ఇంట్రాడే కనిష్ట స్థాయిల నుంచి చూస్తే, సెన్సెక్స్ 639 పాయింట్లు, నిఫ్టీ 295 పాయింట్లు లాభపడ్డాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పతనం కావడంతో ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్, విమానయాన షేర్లు లాభపడ్డాయి. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ షేర్లు చెరో 1.7 శాతం లాభపడ్డాయి. భారతీ ఎయిర్టెల్ 4.2 శాతం లాభపడి రూ.322 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా లాభపడిన షేర్ ఇదే. సన్ ఫార్మా 2% నష్టంతో రూ. 414 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయింది ఇదే.మోతిలాల్ ఓస్వాల్ కంపెనీ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ షేర్‌కు కొనచ్చు రేటింగ్‌ను ఇచ్చింది. దీంతో బ్రిగేడ్ షేర్ 14 శాతం దూసుకుపోయి రూ.235 వద్ద ముగిసింది. ‘ఆంటోని వేస్ట్’ ఐపీఓ పత్రాలు ఆంటోని వేస్ట్ హ్యాండ్లింగ్ సెల్ కంపెనీ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) రానుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సర్వీసులను అందించే ఈ కంపెనీ తాజాగా ఐపీఓ సంబంధిత పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఐపీఓలో భాగంగా రూ.43.5 కోట్ల విలువైన తాజా షేర్లను ఈ కంపెనీ జారీ చేస్తుంది. అంతే కాకుండా కంపెనీ ప్రస్తుత వాటాదారులు 94.42 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్(ఓఎఫ్ఎస్) విధానంలో విక్రయిస్తారు. ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి వినియోగి ంచుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఆనంద్ రాఠి ఐపీఓ వెనక్కి షేర్ బ్రోకింగ్, ఆర్థిక సేవల సంస్థ ఆనంద్ రాఠి వెల్త్ సర్వీసెస్ తన ఐపీఓను (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) వెనక్కి తీసుకుంది. ఈ కంపెనీ ఐపీఓ ద్వారా రూ.425 కోట్లు సమీకరించాలని భావించింది. మార్కెట్ మంచి జోరుగా ఉన్న సెప్టెంబర్‌లో ఐపీఓ పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఆ తర్వాత మార్కెట్ తీవ్రమైన ఒడిదుడుకులకు గురి కావడంతో ఐపీఓ యోచనను విరమించుకోవాలని నిర్ణయం తీసుకుంది. -
సెన్సెక్స్ 245 పాయింట్ల జంప్
ముంబై: ప్రపంచ మార్కెట్ల జోష్‌తో సెన్సెక్స్ డబుల్ సెంచరీని క్రాస్ చేసింది. గురువారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 245.11 పాయింట్ల లాభంతో 26878.24 వద్ద ముగియగా.. నిఫ్టీ తన కీలకమైన మార్కు 8,250ను అధిగమించి 8273.80గా నమోదైంది. అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్టెల్, ఓఎన్జీసీలు సెన్సెక్స్‌లో లాభాలు పండించగా.. టీసీఎస్, ఎన్టీపీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇన్ఫోసిస్‌లు నీరసించాయి. మెటల్, బ్యాంకింగ్, ఆటో స్టాక్స్ మద్దతుతో బీఎస్ఈ సెన్సెక్స్ లాభాల్లో ముగిసినట్టు విశ్లేషకులు చెప్పారు. నిఫ్టీ 50 స్టాక్స్ అన్నింటిల్లో టాటా మోటార్స్, టాటా మోటార్స్ డీవీఆర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. అమెరికాలో జాగ్వార్ ల్యాండ్ రోవర్ విక్రయాలు 30 శాతం ఎగియడంతో ఈ కంపెనీ స్టాక్స్ దాదాపు 4 శాతం మేర లాభాలను ఆర్జించాయి. వరుసగా ఎనిమిదో రోజు ఆసియన్ స్టాక్స్ లాభాల్లో ముగియడం కూడా దేశీయ ఈక్విటీ మార్కెట్లకు సానుకూలంగా నిలిచింది. దీంతో మార్కెట్లకు మంచి కొనుగోలు మద్దతు లభించినట్టు తెలిసింది. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు చెరో 1 శాతం చొప్పున పెరిగాయి. అటు ఎంసీఎక్స్ మార్కెట్లో వరుసగా మూడో రోజు బంగారం ధరలు పెరిగాయి. 158 రూపాయల లాభంలో 10 గ్రాముల బంగారం ధర 27,840గా నమోదైంది. -
లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ప్రారంభమై, లాభాలతో ముగిసాయి. ప్రధాన సూచీల్లో సెన్సెక్స్ 68 పాయింట్ల లాభంతో 29,448 వద్ద ముగియగా, నిఫ్టీ 15 పాయింట్ల లాభంతో 8,937 వద్ద ముగిసింది. -
స్వల్పలాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబై: స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ రెండు ఆల్ టైమ్ హై ను దాటడడంతో ట్రేడర్లు భారీ మొత్తంలో లాభాల స్వీకరణకు దిగారు. దీంతో బుధవారం మార్కెట్లు నష్టాలతో ముగిసాయి. లాభాల స్వీకరణ ఇంకా కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మార్కెట్ ట్రెండ్ పాజిటివ్ గానే ఉందని ఎనలిస్టులు అంచనా వేస్తున్నారు. హెల్త్ కేర్, ఎఫ్ ఎంసీజీ, కన్య్సూమర్ డ్యూర బుల్ సెక్టార్లలో కొనుగోళ్లు కొనసాగుతుంటే....బ్యాంకింగ్ సెక్టార్ లో అమ్మకాల ఒత్తిడి కొద్దిగా కనిపిస్తోంది. -
నేలను కొట్టిన బంతిలా