డమటురు: ఆత్మాహుతి దాడులు, ఉగ్రవాదుల కాల్పులతో నైజీరియా అట్టుడికిపోయింది. ఆత్మాహుతి దాడుల్లో కనీసం 40 మంది మరణించారు. ఈశాన్య నైజీరియాలో ఈ దారుణం జరిగింది. రెండు మసీదుల్లో పేలుళ్లు సంభవించినట్టు ప్రత్యక్ష సాక్షులు, అధికారులు వెల్లడించారు. ఆత్మాహుతి దాడుల్లో ఇద్దరు మహిళా ఉగ్రవాదులు పాల్గొన్నారు.
నైజీరియాలోనే అంతకుముందు బొకొ హరమ్ ఇస్లామిక్ ఉగ్రవాదులు మిలటరీ క్యాంప్పై దాడి చేశారు. భద్రత దళాలు ఈ దాడిని దీటుగా తిప్పికొట్టాయి. కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారని ఆర్మీ ప్రతినిధి కల్నల్ శాని ఉస్మాన్ చెప్పారు. ఈ దాడిలో ఏడుగురు సైనికులు చనిపోయారని, మరో 9 మంది గాయపడ్డారని తెలిపారు.
ఆత్మాహుతి దాడుల్లో 40 మంది మృతి
Published Thu, Oct 8 2015 8:43 AM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM
Advertisement