నైజీరియాలోని మైదుగురి నగర శివార్లలో ఉన్న ఓ మసీదులో జరిగిన రెండు ఆత్మాహుతి దాడుల్లో 14 మంది మరణించారు. వీళ్లలో ప్రార్థనలకు వచ్చినవాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇద్దరు ఆత్మాహుతి బాంబర్లు మసీదులోకి చొరబడి తమను తాము పేల్చేసుకోవడంతో చాలామంది గాయపడ్డారు. తాము కట్టుకుని వచ్చిన ఐఈడీలను పేల్చేసుకున్నారు. దాంతో మసీదు భవనం కూడా కూలిపోయింది. 14 మంది మృతుల్లో ఈ ఇద్దరు బాంబర్లు కూడా ఉన్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినవారిని యూనివర్సిటీ ఆఫ్ మైదుగురి టెక్నికల్ ఆస్పత్రికి, ఇతర ఆస్పత్రులకు తరలించారు.
పేలుడు సంభవించిన వెంటనే భద్రతాదళాలు అక్కడకు చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకున్నాయి. ఈ వారంలోనే ఇది రెండో దాడి. ఇంతకుముందు వేరే ప్రాంతంలో జరిగిన దాడిలో 8 మంది మరణించారు. ఈ రెండు దాడులు చేసింది బోకో హరామ్ ఉగ్రవాదులేనని భావిస్తున్నారు. ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించేందుకు ప్రభుత్వంపై పోరాడుతున్న ఈ ఉగ్రవాద గ్రూపు నైజీరియా రాజధానిలోని ఉత్తర ప్రాంతంలో వరుసపెట్టి బాంబుదాడులకు తెగబడుతోంది. డిసెంబర్ నాటికల్లా బోకోహరాం ఉగ్రవాదాన్ని పూర్తిగా అణిచేయాలని నైజీరియా అధ్యక్షుడు ముహమ్మదు బుహారీ సైన్యాన్ని ఆదేశించారు.
మసీదులో ఆత్మాహుతి దాడులు: 14 మంది మృతి
Published Fri, Oct 16 2015 8:04 AM | Last Updated on Tue, Nov 6 2018 8:35 PM
Advertisement