నిశీధిలోనూ గురితప్పని ‘అగ్ని’ | Nishidhi escaped from fire | Sakshi
Sakshi News home page

నిశీధిలోనూ గురితప్పని ‘అగ్ని’

Published Sat, Apr 12 2014 1:58 AM | Last Updated on Sat, Sep 2 2017 5:54 AM

Nishidhi escaped from fire

బాలాసోర్ (ఒడిశా): భారత్ దేశీయంగా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సామర్థ్యం గల అగ్ని క్షిపణిని తొలిసారిగా రాత్రివేళ విజయవంతంగా ప్రయోగించి పరీక్షించింది. భూతలం నుంచి భూతలం మీదకు ప్రయోగించే అగ్ని-1 ఖండాంతర క్షిపణికి 700 కిలోమీటర్ల లక్ష్య ఛేదన పరిధి ఉంది. ఒడిషా తీరంలోని వీలర్ దీవిలో గల ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్‌లో నాలుగో లాంచ్ ప్యాడ్ నుంచి శుక్రవారం రాత్రి భారత సైన్యం ఈ క్షిపణిని పరీక్షించి చూసిందని డీఆర్‌డీఓ అధికార ప్రతినిధి రవికుమార్‌గుప్తా తెలిపారు.

ఈ పరీక్ష విజయవంతమైందని, ప్రయోగం లక్ష్యాలన్నిటినీ పూర్తిచేసిందని ఆయన పీటీఐ వార్తా సంస్థకు వివరించారు. భారత సైన్యానికి చెందిన స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ వినియోగ పరీక్షలో భాగంగా ఈ ప్రయోగం నిర్వహించిందని ఐటీఆర్ డెరైక్టర్ ఎం.వి.కె.వి.ప్రసాద్ తెలిపారు. అగ్ని-1 మధ్య శ్రేణి క్షిపణిని డీఆర్‌డీఓ అభివృద్ధి చేసింది. దీనిని రాత్రివేళ ప్రయోగించటం ఇదే తొలిసారి.
 
 ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేందుకైనా సంసిద్ధంగా ఉండాల్సిన తన అవసరం దృష్ట్యా భారత సైన్యం రాత్రివేళ ఈ పరీక్ష నిర్వహించినట్లు వెల్లడించారు. ప్రత్యేక నావిగేషన్ వ్యవస్థ గల ఈ క్షిపణి తన లక్ష్యాన్ని అత్యంత కచ్చితంగా చేరుకుంటుంది. 12 టన్నుల బరువు, 15 మీటర్ల పొడవు ఉండే ఈ క్షిపణి 1,000 కిలోల పేలోడ్లను తీసుకువెళ్లగలదు. దీనిని ఇప్పటికే భారత సైన్యం అమ్ములపొదిలో చేర్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement