బాలాసోర్(ఒడిశా): స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధిచేసిన ‘నిర్భయ్’ క్షిపణిని బుధవారం ఒడిశాలోని చాందీపూర్‌లో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ ప్రయోగకేంద్రం నుంచి ప్రయోగించారు. టర్బో–ఫ్యాన్ ఇంజిన్, రాకెట్ మోటార్ బూస్టర్‌తో సాయంతో దూసుకెళ్లి 1000 కి.మీ.S దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా తయారుచేసిన ఈ క్షిపణి.. అధునాతన నేవిగేషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. అయితే, ఈ ప్రయోగ ఫలితంపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా, గతంలో ఎక్కువసార్లు విఫలమైనట్లే ఈసారీ క్షిపణి ప్రయోగం విఫలమైందని వార్తలొచ్చాయి.