ఐదువేలు దాటితే నో క్యాష్‌ పేమెంట్స్‌! | No cash payments over Rs 5000: Jaitley to ministries | Sakshi
Sakshi News home page

ఐదువేలు దాటితే నో క్యాష్‌ పేమెంట్స్‌!

Published Mon, Dec 5 2016 3:26 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

ఐదువేలు దాటితే నో క్యాష్‌ పేమెంట్స్‌! - Sakshi

ఐదువేలు దాటితే నో క్యాష్‌ పేమెంట్స్‌!

న్యూఢిల్లీ: పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ నగదు చెల్లింపులపై అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు జారీచేశారు. కాంట్రాక్టర్లు, వ్యాపారులకు ఐదువేలు దాటి నగదు చెల్లింపులు చేయవద్దని, ఐదువేలకు మించిన బిల్లులన్నింటికీ ఈ-పేమెంట్‌ సౌకర్యాన్ని వాడుకోవాలని ఆదేశించారు. గత ఆగస్టులో నగదు చెల్లింపులపై రూ. 10వేల వరకు పరిమితి విధించగా, ఇప్పుడు దానిని కేంద్రం రూ. 5వేలకు కుదించింది. ప్రభుత్వ చెల్లింపులన్నీ డిజిటలైజ్‌ చేసి.. ఈ-పేమెంట్స్‌ను ప్రోత్సహించాలన్న సంకల్పంతో అన్ని మంత్రిత్వశాఖలకు ఈ ఉత్తర్వులను జారీచేస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది.

పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, ఈ-పేమెంట్స్‌ను మరింతగా ప్రోత్సహించాలని, దేశమంతటా నగదు రహిత చెల్లింపుల విధానం తీసుకురావాలని కేంద్రం సంకల్పించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థికమంత్రి జైట్లీ ఆమోదంతో ఈ ఉత్తర్వులు జారీఅయ్యాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement