డీఎండీకే పొత్తుపై ఎటువంటి చర్చ జరగలేదు:కరుణానిది | No talks on alliance with DMDK for LS polls held: M Karunanidhi | Sakshi
Sakshi News home page

డీఎండీకే పొత్తుపై ఎటువంటి చర్చ జరగలేదు:కరుణానిది

Published Thu, Jan 16 2014 6:48 PM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM

డీఎండీకే పొత్తుపై ఎటువంటి చర్చ జరగలేదు:కరుణానిది

డీఎండీకే పొత్తుపై ఎటువంటి చర్చ జరగలేదు:కరుణానిది

చెన్నై: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో డీఎండీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అంశంపై ఇప్పటి వరకూ ఎటువంటి చర్చ జరగలేదని డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికలకు డీఎండీకేతో డీఎంకే పొత్తు పెట్టుకునే యోచనలో ఉందనే ఊహాగానాల నేపథ్యంలో కరుణ స్పందించారు. ఆ అంశంపై రెండు పార్టీల మధ్య అసలు మాటలే జరగలేదన్నారు. ఎన్నికల్లో మారుతున్న సమీకరణాల దృష్ట్యా ఇరు పార్టీల మధ్య పొత్తు అనే ఆలోచన ఆహ్వానించదగ్గ పరిణామమేనని పేర్కొన్నారు. కాగా వీటిపై ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోలేదన్నారు. పొత్తు విషయాన్ని తన కుమారుడు అళిగిరి వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉండగా అళిగిరి సోదరుడు స్టాలిన్ మాత్రం డీఎండీకే పొత్తుపై సానూకూలంగా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement