
ఇంటర్నెట్ ద్వారా ప్రవాస భారతీయుల ఓటింగ్
న్యూఢిల్లీ: ప్రవాస భారతీయులు ఇక ఇంటర్నెట్ ద్వారా ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు. అయితే అది ఈ ఎన్నికలకు మాత్రం కాదు. ఈ అంశానికి సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) సుప్రీంకోర్టు ధర్మాసానికి నివేదించింది. అయితే ప్రస్తుత ఎన్నికలకు మాత్రం ఇది కుదరదని ఇసి అత్యున్నత న్యాయస్థానానికి తెలిపింది.
ఈ ఆలోచన అమలులోకి వస్తే విదేశాలలో ఉండే భారతీయులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఏర్పడుతుంది.