లైసెన్సులు పొడిగించడం లేదు:నితీష్ కుమార్
Published Wed, Jan 18 2017 4:34 PM | Last Updated on Thu, Jul 18 2019 2:26 PM
పాట్నా: రాబోయే ఆర్థిక సంవత్సరం(2017–2018) నుంచి సంపూర్ణ మద్యపాన నిషేధంలో భాగంగా మద్యం ఉత్పత్తి కంపెనీలకు లైసెన్సులను పొడగించడం లేదని,కొత్త వాటిని ఇవ్వడం లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ స్పష్టం చేశారు. మద్యపాన నిషేధం,సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏవిధంగా పనిచేస్తుందో క్షేత్ర స్థాయిలో తెలుసుకోవడానికి గత డిసెంబర్‌లో ‘నిషాయ్ యాత్ర’ను ప్రారంభించామని చెప్పారు.
ఎక్సైజ్ యాక్ట్–2016 ప్రకారం 2017 ఏప్రిల్ 1నుంచి రాష్ట్రమంతటా సంపూర్ణ మద్యపాన నిషేధం అమలులోకి వస్తుందని,మద్యం కంపెనీలకు మాత్రమే కాక, బీర్ల కంపెనీలకు కూడా లైసెన్సులను ఇవ్వడం లేదని వెల్లడించారు.ఇథనాల్ యూనిట్లను మాత్రం కొనసాగిస్తామని, దానివల్ల పర్యావరణానికి మేలు జరిగేలా పెట్రోల్‌లో మిశ్రమంలా కలుపుతామన్నారు.అందుకు అనుగుణంగా మంగళవారం క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
Advertisement