* లేదంటే వైద్యానికి గుర్తింపు ఉండదు
* మెడికో లీగల్, ఆరోగ్యశ్రీ క్లెయిముల తిరస్కరణ
సాక్షి, హైదరాబాద్: ఎక్కడో రిజిస్ట్రేషన్ చేశాం.. కానీ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం.. అంటే వైద్యులకు కుదరదు. ఈ రాష్ట్రంలో ప్రాక్టీస్ చెయ్యాలంటే ఇక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి... ఇదీ తాజా నిబంధన. గతంలో భారతీయ వైద్యమండలి(ఎంసీఐ) రిజిస్ట్రేషన్(సెంట్రల్ రిజిస్ట్రేషన్)తో ఎక్కడైనా వైద్యం చేసుకునే అవకాశం ఉండేది. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ నిబంధన మార్చారు. ఎంబీబీఎస్ గానీ, పీజీగానీ పూర్తి చేసి, ఇక్కడ ప్రాక్టీస్ చేయాలంటే ఏపీ లేదా తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలి. ఇందుకు విధిగా ఏడాది ప్రభుత్వ సర్వీసు చేసి ఉండాలి. హైదరాబాద్‌తోపాటు విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి ప్రాంతాల్లో చాలామంది ఉత్తరాదికి చెందిన వైద్యులు వైద్యం చేస్తున్నారు. రాష్ట్రానికి చెందిన అనేకమంది ఇతర రాష్ట్రాల్లో పీజీ పూర్తి చేసిన వాళ్లున్నారు.
వీళ్లందరూ విధిగా ఏడాదిపాటు ప్రభుత్వ సర్వీసు (ఏదో ఒక ప్రభుత్వాసుపత్రిలో వైద్యం) చేస్తేనే మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తోంది. ఆస్పత్రుల్లో ప్రభుత్వ సర్వీసు చేసినట్టు ధ్రువీకరణ తెస్తేనే రిజిస్ట్రేషన్‌కు అనుమతిస్తున్నారు. ఒక వేళ ఇక్కడ రిజిస్ట్రేషన్ చెయ్యకపోతే.. ఆ వైద్యుల ప్రాక్టీస్‌కు గుర్తింపు ఉండదు. అంటే మెడికో లీగల్ కేసులకు ఇలా గుర్తింపులేని వైద్యుల ట్రీట్‌మెంట్ చెల్లదు. ఆరోగ్యశ్రీ కేసులకు క్లెయిమ్ చేసుకోవడానికి అనర్హులు. వీరి దగ్గర ట్రీట్‌మెంట్ తీసుకున్న పేషెంట్లకు ఇన్సూరెన్స్ క్లెయిము చేసుకునేందుకు వీలులేదు. విధిగా ఏపీ/ తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకుని, ఆనంబరును విధిగా నోట్ చేసి ఉంటేనే క్లెయిములు వస్తాయి. అయినా సరే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోకుండా వందలాదిమంది వైద్యులు ప్రాక్టీస్ చేస్తుండటం గమనార్హం.
ఎక్కడ రిజిస్ట్రేషన్ చేస్తే అక్కడే ప్రాక్టీస్
Published Thu, Sep 17 2015 2:23 AM | Last Updated on Thu, Aug 30 2018 9:15 PM
Advertisement
Advertisement