ఇక ఫేస్బుక్ మెసెంజర్లోనూ గేమ్స్ ఆడొచ్చు | Now, play game on Facebook Messenger | Sakshi
Sakshi News home page

ఇక ఫేస్బుక్ మెసెంజర్లోనూ గేమ్స్ ఆడొచ్చు

Published Fri, Jun 12 2015 3:33 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

ఇక ఫేస్బుక్ మెసెంజర్లోనూ గేమ్స్ ఆడొచ్చు - Sakshi

ఇక ఫేస్బుక్ మెసెంజర్లోనూ గేమ్స్ ఆడొచ్చు

ఫేస్బుక్ మెసెంజర్ అనగానే స్నేహితులతో చాటింగ్ చేయడం ఒక్కటే మనకు తెలుసు. కానీ ఇప్పుడు అందులోనూ గేమ్స్ ఆడుకునేలా సరికొత్త ఫీచర్ వచ్చి చేరుతోంది. డూడుల్ డ్రా గేమ్ ఒకదాన్ని ముందుగా అందులో యాక్టివేట్ చేశారు. యాప్తో పాటే ఈ గేమ్ అందుబాటులో ఉంటుంది. మెసెంజర్ ఓవర్ఫ్లో మెనూలో ఈ గేమ్ కనపడుతుంది. దాంతోపాటు అనేక యుటిలిటీ యాప్లు కూడా ఉంటాయి. అయితే, ఆటాడుకోవాలంటే మాత్రం ఒకసారి దాన్ని గూగుల్ ప్లే లేదా యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి.

ఫేస్బుక్ తన మెసెంజర్ యాప్ను విడుదల చేసిన తర్వాత లాంచ్ చేసిన మొదటి గేమ్ డూడుల్ డ్రా. వుయ్ చాట్, లైన్, వైబర్ లాంటి ఇతర మెసేజింగ్ యాప్లలో అయితే గేమ్స్ ఉన్నాయి. వీటి ద్వారా.. యూజర్లు చాటింగ్ చేయనప్పుడు కూడా తమ యాప్లు ఓపెన్ చేసేలా చూసుకుంటున్నాయి. ఇప్పుడు ఫేస్బుక్ మెసెంజర్లో కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement