కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ప్రభుత్వం తిరస్కరించిన అణు విద్యుత్ ప్లాంటును ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసేందుకు నేషనల్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐఎల్) ప్రయత్నిస్తోంది. ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఏపీలో తగిన స్థలం కోసం అన్వేషిస్తోంది. నిజానికి బెంగాల్‌లోని హరిపూర్ పట్టణంలో ఎన్‌పీసీఐఎల్ ఈ అణు విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేయాలని గతంలో తలపెట్టింది. అయితే స్థానిక రైతులు, మత్స్యకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రతిపాదిత 6వేల మెగావాట్ల ఈ విద్యుదుత్పత్తి ప్లాంటుకు నో చెప్పింది.
ఈ నేపథ్యంలో ఎన్‌పీసీఐఎల్ దృష్టి తాజాగా ఆంధ్రప్రదేశ్‌పై పడింది. దీనిపై ఎన్‌పీసీఐఎల్ బోర్డు సభ్యుల్లో ఒకరైన బాబా ఆటమిక్ రీసెర్చ్ సెంటర్ డెరైక్టర్ శేఖర్ బసు శనివారం కోల్‌కతాలో మాట్లాడుతూ హరిపూర్‌లో ప్రతిపాదించిన అణువిద్యుత్ ప్లాంటు తరహాదానిని.. ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని, ఇందుకోసం రాష్ట్రానికి చెందిన కోస్తా తీర ప్రాంతంలో భూమికోసం అన్వేషిస్తున్నామని చెప్పారు. తగిన స్థలం కోసం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగుతున్నాయని బసు వెల్లడించారు. అయితే పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కోరుకున్నట్లయితే హరిపూర్‌లో ఏ సమయంలోనైనా ఈ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమని పేర్కొన్నారు.
ఏపీలో ఎన్‌పీసీఐఎల్ అణువిద్యుత్ ప్లాంటు!
Published Sun, Sep 27 2015 4:11 AM | Last Updated on Sun, Sep 3 2017 10:01 AM
Advertisement