కలాం హయాంలోనే అసాధారణ పురోగతి | Obama mourns Kalam 'an advocate for stronger US-India relations' | Sakshi
Sakshi News home page

కలాం హయాంలోనే అసాధారణ పురోగతి

Published Wed, Jul 29 2015 9:44 AM | Last Updated on Thu, Apr 4 2019 5:04 PM

కలాం హయాంలోనే అసాధారణ పురోగతి - Sakshi

కలాం హయాంలోనే అసాధారణ పురోగతి

వాషింగ్టన్: భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం అకస్మిక మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మంగళవారం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలాం మృతికి సంతాపం ప్రకటించారు. భారత్ అమెరికా దేశాల మధ్య అంతరిక్ష సహకారం కోసం కలాం చేసిన కృషిని ఈ సందర్భంగా ఒబామా గుర్తు చేసుకున్నారు. అలాగే ఇరుదేశాల మధ్య సంబంధాలు దృఢపరిచే క్రమంలో ఆయన మద్దతుగా నిలిచిన వైనాన్ని ఒబామా విశదీకరించారు. ఓ శాస్త్రవేత్తగా, ఓ స్టేట్స్మెన్గానే కాకుండా భారత్లో అత్యంత అరుదైన నాయకుల్లో ఒకరిగా అబ్దుల్ కలాం దేశ విదేశాలలో గౌరవం సంపాదించారన్నారు.

భారత్కు 11వ రాష్ట్రపతిగా కలాం బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత - అమెరికా దేశాల మధ్య అసాధారణ పురోగతి సాధ్యమైందని ఒబామా స్పష్టం చేశారు. ప్రజల రాష్ట్రపతి అనే పదానికి అసలు సిసలైన నిర్వచనం అబ్దుల్ కలాం అని అభివర్ణించారు. కలాం వినయ విధేయతలతోపాటు ప్రజసేవకు అంకితమైన తీరు భారతీయ ప్రజలకే కాదు ప్రపంచానికే స్ఫూర్తి అని ఒబామా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement