సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యాన్ని నివారించేందుకు చేపట్టిన సరి-బేసి వాహన విధానం రెండో దశను ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకూ చేపట్టనున్నట్టు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. రెండో దశలోనూ మహిళలు, వీఐపీలు, ద్విచక్ర వాహనాలకు మినహాయింపు కొనసాగుతుందన్నారు. జనవరి 1 నుంచి 15వ తేదీ వరకూ ప్రయోగాత్మకంగా సరి-బేసి విధానాన్ని ఢిల్లీలో ప్రవేశపెట్టడం తెలిసిందే. గురువారం ఢిల్లీలో విలేకరులతో మాట్లాడిన కేజ్రీవాల్ సరి-బేసి రెండో దశ తేదీలను ప్రకటించారు. సరి-బేసి విధానానికి మంచి స్పందన లభించిందని, మెజారిటీ ప్రజలు ఈ విధానాన్ని కొనసాగించాలని కోరారని చెప్పారు.
ప్రతి నెలా పదిహేనుల రోజుల పాటు ఈ విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. ఢిల్లీలోని ప్రజా రవాణా వ్యవస్థ ప్రయాణికులను పూర్తి స్థాయిలో చేరవేసేందుకు అనువుగా లేదన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను మెరుగు పరిచేందుకు సుమారు 3 వేల బస్సులను(వెయ్యి లగ్జరీ బస్సులతో పాటు) అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు.
‘ఏప్రిల్ 15 నుంచి రెండో విడత సరి-బేసి’
Published Fri, Feb 12 2016 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 5:26 PM
Advertisement