న్యూఢిల్లీ: అయిదు అనుబంధ బ్యాంకులు, భారతీయ మహిళా బ్యాంకు విలీనంతో అతిపెద్ద బ్యాంక్‌గా అవతరించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త లోగో వచ్చేసింది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ కొత్త లోగోతో దర్శనమివ్వనుంది. కొత్త ఆర్ధిక సంవత్సరంలో సరికొత్త లోగోతో న్యూ బ్రాండ్ ఐడెంటిటితో వినియోగదారులు ఆర్థిక సేవలందించేందుకు సిద్ధంగా ఉంది. ఈ బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తికానుంది. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఇవి ఎస్‌బీఐ శాఖలుగా పనిచేయనున్నాయి. దీంతో ప్రపంచంలో టాప్ 50 జాబితాలో చేరిపోయింది.
టెక్నాలజీ అవగాహన, ఆధునిక & ప్రగతిశీలమైన మా కొత్త లోగోతో భారతీయులు ఆర్ధిక అవసరాల సిద్ధంగా ఉన్నామని ఎస్‌బీఐ ప్రకటించింది. దిగ్గజ బ్యాంకుగా మారనున్న బ్యాంక్ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీని డిజైనింగ్ చేసినట్టు దినేష్ మీనన్ వెల్లడించారు. మోడరన్ ఇండియావైపు ఎస్‌బీఐ ప్రగతిశీల ప్రయాణాన్ని ఇది ప్రతిబింబిస్తుందని తెలిపారు. కొత్త (డిజిటల్) సేవలతో పునరుద్ధరించబడింది వైభవం తో వినియోగదారులు ఒక కొత్త తరం సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
పాతగా ఉన్నలోగోలోనే స్వల్ప మార్పులు చేసి బ్యాక్ గ్రౌండ్ కలర్‌ను నీలి రంగులోకి మార్చి కొత్త లోగోను తయారు చేశారు. గతంలో బ్యాక్‌గ్రౌండ్ తెల్లరంగులో ఉండేది. కొత్తగా ట్యాగ్‌లైన్ ఫాంట్‌ను కూడా మార్చారు. బ్యాంకు కొత్త లోగోడిజైన్ ను ముంబై కి చెందిన స్టాక్ అనే కంపెనీ రూపొందించింది.
Our New Logo: Technology savvy, modern & progressive, ready to meet the financial needs of all Indians. Read now: https://t.co/vRVpis3Kpi pic.twitter.com/Ed23TBsjkm
— State Bank of India (@TheOfficialSBI) April 1, 2017