యూఎస్లో పాక్ నూతన రాయబారిగా జిలానీ | Pakistan appoints Jilani as new ambassador to US | Sakshi
Sakshi News home page

యూఎస్లో పాక్ నూతన రాయబారిగా జిలానీ

Published Sat, Nov 9 2013 9:03 AM | Last Updated on Sat, Mar 23 2019 8:00 PM

Pakistan appoints Jilani as new ambassador to US

అమెరికాలో పాకిస్థాన్ నూతన రాయబారిగా జలీల్ అబ్బాస్ జిలానీని నవాజ్ షరీఫ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు గత రాత్రి పాక్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రస్తుతం జలీల్ అబ్బాస్ జిలానీ పాక్ విదేశాంగ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కావున డిసెంబర్ మాసంలో జిలానీ కొత్త బాధ్యతలు స్వీకరిస్తారని  విడుదల చేసిన ఆదేశాల్లో పేర్కొంది.

 

గతంలో జిలానీ పాక్ రాయబారిగా బెల్జియం, లక్సింబర్గ్, యూరోపియన్ యూనియన్ దేశాల్లో పని చేశారని ఈ సందర్భంగా తెలిపింది. అలాగే 1990 -1992 మధ్య కాలంలో పాక్ ప్రధాన మంత్రి కార్యాలయంలో డిప్యూటీ సెక్రటరీగా పని చేశారని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement