'అసలు యుద్ధాన్ని ఊహించనే వద్దు'
వాషింగ్టన్: భారత్-పాకిస్థాన్ మధ్య సమస్యకు యుద్ధం పరిష్కారం అవుతుందని తాను అనుకోవడం లేదని అమెరికాలో పాక్ రాయభారి జలీల్ అబ్బాస్ జిలానీ అన్నారు. కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారా మాత్రమే సమస్యలకు పరిష్కారం అవుతుందని, అయితే అలా చర్చించే అంశాల్లో కశ్మీర్ అంశం కూడా ఉండాలని చెప్పారు.
'యుద్ధం ఎప్పటికీ పరిష్కారం కాదు. ముఖ్యంగా అణ్వాయుధాలు కలిగి ఉన్న రెండు దేశాల మధ్య. అసలు యుద్ధాన్ని ఊహించకూడదు కూడా. అందుకే పాకిస్ధాన్ అంతర్జాతీయ న్యాయ సమాజం ప్రకారం కశ్మీర్ తో సహా ప్రతి సమస్యను చర్చ ద్వారానే పరిష్కరించుకోవాలని అనుకుంటోంది' అని జిలానీ చెప్పారు.