పాక్ మార్కెట్లకు భారత్ దెబ్బ | Pakistan stock market too takes a hard knock, KSE100 index tanks 500 points | Sakshi
Sakshi News home page

పాక్ మార్కెట్లకు భారత్ దెబ్బ

Published Thu, Sep 29 2016 3:28 PM | Last Updated on Mon, Sep 4 2017 3:31 PM

పాక్ మార్కెట్లకు భారత్ దెబ్బ

పాక్ మార్కెట్లకు భారత్ దెబ్బ

కరాచీ: భారత దెబ్బకు పాకిస్తాన్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. పాకిస్థాన్ భూభాగంపై భారత సైన్యం దాడుల నేపథ్యంలో కరాచీ స్టాక్ మార్కెట్ 100 ఇండెక్స్ దాదాపు 500  పాయింట్లకు పైగా  పతనమైంది. ఒక దశలో 532  పాయింట్లు పతనమైన 40,328.93 స్థాయికి పడిపోయింది.

అనంతరం  భారత సైన్యం దాడులను ఖండిస్తున్నట్లు పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్   సైన్యం దాడులను  ఖండించడంతో  కోలుకున్నాయి.  తాము శాంతి కావాలని కోరుకుంటున్నామని,  తమ దేశ రక్షణ, భద్రతలకు తాము సిద్ధంగా ఉన్నామని  భరోసా ఇవ్వడంతో కొంత తెప్పరిల్లాయి. అయితే భారత్ నుంచి  ఎలాంటి సర్జికల్  దాడులు జరగలేదని, అర్థరాత్రి  భారత సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు  పాకిస్తానీ సైనికుల మరణించారని పాక్ ఖండించినప్పటికీ  పెద్దగా ఫలితం లేదు. 

కాగా పాక్  భూభాగంలో  భారత సైన్యం దాడులు చేసింది. పాకిస్థాన్ భూభాగంలోకి మూడు కిలోమీటర్ల మేర చొరబడి.. అక్కడున్న ఉగ్రవాదుల లాంచ్ ప్యాడ్లపై  సర్జికల్ స్ట్రైక్స్  చేశామనీ, ఆపరేషన్ ముగిసిందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్ సింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement