బ్రెజిల్ లోని బెలో హారిజాంట్ నగరంలోని ఓ చర్చిలో దారుణం జరిగింది. అక్కడ ఓ ప్రొటెస్టెంటు పాస్టర్ను తలలో కాల్చి చంపేశారు. చార్లెస్ విడల్ డిసౌజా (34)కు అక్కడికక్కడే ప్రాథమిక చికిత్స చేశారు. సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లేసరికి కూడా ఆయన సజీవంగానే ఉన్నారు. కానీ తలలో బుల్లెట్ గాయం కావడంతో వైద్యులు ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు.
యూనివర్సల్ చర్చ్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ వద్ద ఈ సంఘటన జరిగింది. డిసౌజా తన కార్యాలయంలో నెత్తుటి మడుగులో పడి ఉండగా చుట్టుపక్కల వారు చూశారు. అక్కడ గొడవ జరిగినట్లు కూడా కనిపించడంతో వెంటనే పోలీసులకు తెలిపారు. ఇద్దరు సాయుధులు చర్చిలోకి ప్రవేశించి కాల్పులు జరిపి, తర్వాత గుమ్మం బయట ఉంచిన కారులో పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.