ఇండియా ఫస్ట్‌లైఫ్ పెన్షన్ ప్లాన్
ప్రైవేటు రంగ బీమా కంపెనీ ఇండియా ఫస్ట్‌లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ గ్యారంటీడ్ రిటైర్మెంట్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. 40 ఏళ్ల తర్వాత నుంచి ఎప్పుడైనా పెన్షన్ పొందే విధంగా ఈ పాలసీని రూపొందించారు. పెన్షన్ పొందడానికి వెస్టింగ్ ఏజ్ 40 నుంచి 80 ఏళ్లుగా నిర్ణయించారు. ఈ పాలసీకి ప్రీమియం ఒకేసారిగా లేదా పరిమిత కాలానికి చెల్లించొచ్చు. 10 నుంచి 35 ఏళ్ల కాలపరిమితికి ప్రీమియం 5 నుంచి 10 ఏళ్లు చెల్లించొచ్చు. ప్రీమియం చెల్లించే ప్రారంభ సంవత్సరాల్లో 9 శాతం గ్యారంటీడ్ బోనస్‌ను అందిస్తుంది. ఆ తర్వాత కాలంలో కంపెనీ లాభాల ఆధారంగా బోనస్‌ను ఇస్తారు.
ఐసీఐసీఐ బిజినెస్ సైకిల్ ఫండ్
ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ సంస్థ బిజినెస్ సైకిల్ ఫండ్‌లో సిరీస్-3ని ప్రారంభించింది. ఇది క్లోజ్‌డ్ ఎండెడ్ మల్టీక్యాప్ ఈక్విటీ పథకం. ఈ పథకం లాకిన్ పిరియడ్ 1,125 రోజులుగా నిర్ణయించారు. కనీస ఇన్వెస్ట్‌మెంట్ మొత్తం రూ. 5,000. జనవరి 8న ప్రారంభమైన న్యూ ఫండ్ ఆఫర్ జనవరి 22న ముగుస్తుంది.
స్టాన్‌చార్ట్ ఖాతాదారుల కోసం..
ప్రైవేటు జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆరోగ్య బీమా పాలసీని ప్రవేశపెట్టింది.‘లైఫ్‌లైన్’ పేరుతో ప్రారంభించిన ఈ ఆరోగ్య బీమా పాలసీ కింద కనిష్టంగా రూ. 2 లక్షల నుంచి గరిష్టంగా రూ. 1.5 కోట్ల వరకు బీమా రక్షణ కల్పిస్తుంది. అంతేకాకుండా క్లాసిక్, ఎలైట్, సుప్రీం పేరుతో మూడు రకాల లైఫ్‌లైన్ పాలసీలను అందిస్తోంది. 11 తీవ్ర వ్యాధులకు బీమా రక్షణ కల్పిస్తుంది.
రూ.3.64 లక్షల కోట్లకు ఈక్విటీ ఎంఎఫ్ నిర్వహణ ఆస్తులు
ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ నిర్వహణ ఆస్తుల విలువ (ఏయూఎం) డిసెంబర్ చివరి నాటికి 29 శాతం వృద్ధితో రూ.3.64 లక్షల కోట్లకు పెరిగింది. ఈ విలువ గతేడాది డిసెంబర్‌లో రూ.2.83 లక్షల కోట్లుగా ఉంది. ఏయూఎం విలువ పెరుగుదలకు ఆయా స్కీమ్స్‌పై రిటైల్ ఇన్వెస్టర్ల ప్రాధాన్యం పెరగడమే కారణం. ఈ విషయాలను అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (యాంఫీ) వెల్లడించింది. ఇక నవంబర్‌లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ ఏయూఎం విలువ రూ.3.62 లక్షల కోట్లుగా ఉంది.
పర్సనల్ ఫైనాన్స్ బ్రీఫ్స్..
Published Mon, Jan 18 2016 12:47 AM | Last Updated on Sun, Sep 3 2017 3:48 PM
Advertisement