‘జయపై విషప్రయోగం అవాస్తవం’ | PH Pandian allegation is completely false: PS Ramachandran | Sakshi
Sakshi News home page

‘జయపై విషప్రయోగం అవాస్తవం’

Published Tue, Feb 7 2017 3:42 PM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

‘జయపై విషప్రయోగం అవాస్తవం’

‘జయపై విషప్రయోగం అవాస్తవం’

చెన్నై: జయలలితది సహజ మరణం కాదని పీహెచ్ పాండియన్, మనోజ్ పాండియన్ చేసినా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నాడీఎంకే సీనియర్ నేత పీఎస్ రామచంద్రన్ అన్నారు. జయలలితపై విషప్రయోగం జరిగిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆమెపై విషప్రయోగం జరిగిందా, లేదా అనేది డాక్టర్లు మాత్రమే చెప్పగలరని తెలిపారు. పార్టీ శ్రేణులను పాండియన్ సోదరులు గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చెప్పాలని సూచించారు.

పీహెచ్ పాండియన్ కుటుంబానికి చెందిన ఐదుగురు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీలో చిచ్చు పెడుతున్నారని మరో సీనియర్ నాయకుడు సెంగొట్టవన్ ధ్వజమెత్తారు. చిన్నమ్మను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. శశికళకు వ్యతిరేకంగా పీహెచ్ పాండియన్, మనోజ్ పాండియన్ గళమెత్తారు. జయలలిత మరణానికి శశికళ కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు.

Advertisement

పోల్

Advertisement