PH Pandian
-
మాజీ స్పీకర్ కన్నుమూత
చెన్నై : తమిళనాడు మాజీ అసెంబ్లీ స్పీకర్, ఏఐడీఎంకే సీనియర్ నేత పీహెచ్ పాండియన్ (74) శనివారం మృతి చెందారు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుత్ను ఆయన వెల్లూరులోని క్రిస్టియన్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఆయన డీఎంకే నుంచి వైదొలిగిన తర్వాత ఎంజీ రామచంద్రన్ స్థాపించిన ఏఐడీఎంకే పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరిగా చేరారు. చెరన్మదేవి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పాండియన్ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈయన 1985 నుంచి 1989 వరకు అసెంబ్లీ స్పీకర్‌గా సేవలు అందించారు. అదేవిధంగా 1999లో తిరునెల్వేలి లోక్‌సభ స్థానం నుంచి పార్లమెంట్ సభ్యునిగా గెలుపొందారు. పీహెచ్ పాండియన్ అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్న సమయంలో స్పీకర్‌కు ప్రత్యేకమైన ఆధికారాలు ఉన్నాయంటూ శక్తివంతమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఆయన ఏఐడీఎంకే పార్టీకి తన విశేష సేవలను అందించారు. -
‘జయపై విషప్రయోగం అవాస్తవం’
చెన్నై: జయలలితది సహజ మరణం కాదని పీహెచ్ పాండియన్, మనోజ్ పాండియన్ చేసినా ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని అన్నాడీఎంకే సీనియర్ నేత పీఎస్ రామచంద్రన్ అన్నారు. జయలలితపై విషప్రయోగం జరిగిందన్న ఆరోపణలను ఆయన తోసిపుచ్చారు. ఆమెపై విషప్రయోగం జరిగిందా, లేదా అనేది డాక్టర్లు మాత్రమే చెప్పగలరని తెలిపారు. పార్టీ శ్రేణులను పాండియన్ సోదరులు గందరగోళానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. ఏదైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై చెప్పాలని సూచించారు. పీహెచ్ పాండియన్ కుటుంబానికి చెందిన ఐదుగురు పదవులు అనుభవించి ఇప్పుడు పార్టీలో చిచ్చు పెడుతున్నారని మరో సీనియర్ నాయకుడు సెంగొట్టవన్ ధ్వజమెత్తారు. చిన్నమ్మను సీఎం కాకుండా ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. శశికళకు వ్యతిరేకంగా పీహెచ్ పాండియన్, మనోజ్ పాండియన్ గళమెత్తారు. జయలలిత మరణానికి శశికళ కారణమని తీవ్ర ఆరోపణలు చేశారు.