నేడు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్‌‌స లిస్టింగ్ | PNB Housing Finance listing | Sakshi
Sakshi News home page

నేడు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్‌‌స లిస్టింగ్

Published Mon, Nov 7 2016 3:08 AM | Last Updated on Mon, Sep 4 2017 7:23 PM

నేడు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్‌‌స లిస్టింగ్

నేడు పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్‌‌స లిస్టింగ్

 రేపు వరుణ్ బేవరేజేస్
 న్యూఢిల్లీ: పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్‌‌స, వరుణ్ బేవరేజేస్ కంపెనీలు ఈ వారంలోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ)  ప్రమోట్ చేస్తున్న పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్‌‌స నేడు(సోమవారం), పెప్సికో అతి పెద్ద ప్రాంఛైజీ వరుణ్ బేవరేజేస్ కంపెనీ రేపు(మంగళవారం) స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ కానున్నాయి. రూ.750-775 ఇష్యూ ధరతో గత నెల 25-27 మధ్యన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చిన పీఎన్‌బీ హౌసింగ్ ఫైనాన్‌‌స కంపెనీ రూ.3,000 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 30 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్‌అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్విబ్స్)కు కేటాయించిన వాటా 37 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 86 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 1.35 రెట్లు చొప్పున సబ్‌స్క్రైబ్ అయ్యాయి.

 రూ.440-445 ఇష్యూ ధరతో గత నెల 26-28 మధ్యన ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు వచ్చిన వరుణ్ బేవరేజేస్ కంపెనీ రూ.1,112.5 కోట్లు సమీకరించింది. ఈ ఐపీఓ 1.86 రెట్లు ఓవర్ సబ్‌స్క్రై బ్‌అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్(క్విబ్స్)కు కేటాయించిన వాటా 5 రెట్లు, సంస్థాగేతర ఇన్వెస్టర్లకు కేటయించిన వాటా 42%, రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 79% చొప్పున సబ్‌స్క్రైబ్ అయ్యాయి. కాగా ఈ  ఏడాది ఇప్పటివరకూ దాదాపు 22 కంపెనీలు స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్టయ్యాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement