ఆ యువతి సూట్‌కేసును తెరువగానే.. | police unzip a woman suitcase to find an boy stuffed inside | Sakshi
Sakshi News home page

ఆ యువతి సూట్‌కేసును తెరువగానే..

Published Thu, Aug 4 2016 4:49 PM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

ఆ యువతి సూట్‌కేసును తెరువగానే.. - Sakshi

ఆ యువతి సూట్‌కేసును తెరువగానే..

ఆ యువతి భారీ లగేజీతో రైల్వేస్టేషన్‌కు వచ్చింది. ఓ భారీ సూట్‌కేసు పట్టుకొని అటు-ఇటు అనుమానాస్పదంగా తిరిగింది. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. ఆ సూట్‌కేసులో ఏం తీసుకెళ్తున్నావని ఆమెను ఆరా తీశారు. సరైన సమాధానం రాకపోవడంతో సూట్‌కేసును తెరిచిచూశారు. వారిని బిత్తరపరుస్తూ ఓ 11 ఏళ్ల బాలుడు అందులోంచి బయటకు వచ్చాడు. సూట్‌కేసులోంచి బుడగలాగా బయటకు తేలిన ఆ బాలుడిని చూసి పోలీసులు షాక్‌ తిన్నారు. బ్రెజిల్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తోంది.   

23 ఏళ్ల నాటాషా విటోరియానో సౌటోకు 11 ఏళ్ల బాలుడు రోడ్డు మీద కనిపించాడు. తన తల్లిదండ్రులు డ్రగ్స్‌కు బానిసలై తనను వేధిస్తున్నారని, తనను వారి నుంచి కాపాడాలని ప్రాధేయపడ్డాడు. తనను దతత్త తీసుకోవాలని కోరాడు. బాలుడి దీనావస్థతో కరిగిపోయిన సౌటో అతడిని కాపాడి తన వెంట ఇంటికి తీసుకెళ్లాలని నిశ్చయించింది. అందుకోసమే అతి జాగ్రత్తగా బాలుడిని బ్లాంకెట్‌లో చుట్టి.. అతడిని సూట్‌కేసులో తోసి.. దానిని పట్టుకొని రైల్వే స్టేషన్‌కు బయలుదేరింది. అనుమానం వచ్చిన పోలీసులు తెరువడంతో అసలు బండారం బయటపడింది. ఒలింపిక్స్‌ వేడుకలు జరుగనున్న రియో డీజెనిరోకు 550 ఏళ్ల దూరంలోని ఓ రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం బాలుడిని సంరక్షణ కేంద్రానికి అప్పగించిన పోలీసులు అతన్ని సూట్‌కేసులో తీసుకెళ్లిన యువతిపై మాత్రం అభియోగాలు నమోదుచేయలేదు. వారు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement