ప్రహ్లాదుడు ఏమయ్యాడో? | prahladudu also missing, related to bus agent | Sakshi
Sakshi News home page

ప్రహ్లాదుడు ఏమయ్యాడో?

Published Wed, Jun 11 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 8:35 AM

prahladudu also missing, related to bus agent

బియాస్ దుర్ఘటనలో కర్నూలు వాసి గల్లంతు
బంధువైన ట్రావెల్ ఏజెంట్‌తో కలిసి టూర్‌కు
 
 రుద్రవరం (కర్నూలు): రెండు రోజులు గడిచినా చేతికంది వచ్చిన కొడుకు జాడ తెలియకపోవడం వృద్ధ తల్లిదండ్రులను కలవరపరుస్తోంది. హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదిలో గల్లంతైన వారిలో ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు ప్రహ్లాదుడు (22) అనే మరో యువకుడు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. కర్నూలు జిల్లా రుద్రవరం మండలం ఆలమూరువాసి అయిన ఇతను తన మామ అయిన బస్సు ఏజెంటుకు తోడుగా వెళ్లి ప్రమాదం బారిన పడ్డాడు. ప్రహ్లాదుని మామ కడప జిల్లా మైలవరం మండలం యాపరేవుల వాసి మురళి పదేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ట్రావెల్స్ నిర్వహిస్తున్నాడు. ప్రహ్లాదుడు జూన్ 1న మురళి ఇంటికి వెళ్లాడు. అతను విజ్ఞాన్‌జ్యోతి ఇంజనీరింగ్ విద్యార్థుల విహారయాత్రకు ఏజెంట్‌గా వెళ్తూ రమ్మనడంతో తోడుగా వెళ్లాడు. ఆదివారం బియాస్ నదిలో ఫొటోలు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా నీరు ముంచెత్తడంతో విద్యార్థులతో పాటు ప్రహ్లాదుడు కూడా కొట్టుకుపోయాడు.

 

కానీ ఇప్పటిదాకా మిగతా వారితో పాటు అతని ఆచూకీ కూడా తెలియకపోవడంతో అతని వృద్ధ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. అనారోగ్యంతో ఊరు వదిలి వెళ్లలేని స్థితిలో ఉన్న తమకు ఇదెక్కడి దౌర్భాగ్యమంటూ విలపిస్తున్నారు. మురళి ప్రోత్సాహంతో హైదరాబాద్‌లో ఎంబీఏలో చేరిన ప్రహ్లాదుడు వెన్నెముక నొప్పితో ఫస్టియర్‌తోనే ఆపేసి ఊళ్లోనే వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు.


 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement