85 స్మార్ట్‌సిటీల ప్రతిపాదనలు సిద్ధం
తెలంగాణలో హైదరాబాద్ బదులు మరో నగరం
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల నిర్మాణం కోసం ప్రతిపాదిన 98 నగరాల్లో 85 మాత్రమే ఇంతవరకు నగరస్థాయి నివేదికలను కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు ప్రతిపాదలను పంపించాయి. ప్రతిపాదనలు పంపేందుకు చివరిరోజైన మంగళవారం 68 నగరాలు నివేదికలు అందించగా.. సోమవారం 17 సిటీలు ప్రపోజల్స్ పంపించాయి. వరదల కారణంగా తమిళనాడు ప్రతిపాదనలు పంపలేదు. కాగా, హైదరాబాద్ స్థానంలో మరో నగరాన్ని స్మార్ట్ సిటీ జాబితాలో చేర్చాలని తెలంగాణ సర్కారు కోరింది. ఆ నగరం పేరును త్వరలోనే వెల్లడిస్తామని కేంద్రానికి తెలిపింది. ప్రతిపాదనలు వచ్చిన వాటిలో 20 నగరాలను ఎంపికచేసి జనవరి మూడోవారం కల్లా ‘స్మార్ట్ సిటీ ప్రాజెక్టు’ పనులు ప్రారంభించేందుకు నిధులు ఇస్తారు.
ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు రాష్ట్రాలకు మూడు వర్క్‌షాప్‌లు, ఓ స్మార్ట్‌సిటీ ఐడియా క్యాంపు, ఐదు రౌండ్ల వెబినార్లు, ప్రతిపాదనల అభివృద్ధికి మరో వర్క్‌షాప్ నిర్వహించింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో 20 దేశాలనుంచి 30 విదేశీ కంపెనీలు భాగస్వామ్యం కానున్నాయి. కాగా, దేశవ్యాప్తంగా 474 పట్టణాల్లో మౌలికవసతుల అభివృద్ధి కోసం రూపొం దించిన అమృత్ (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్)పథకానికి రూ.19వేల కోట్లు బడ్జెట్ కేటాయింపులకు రంగం సిద్ధమైంది.