న్యూఢిల్లీ: పాకిస్థాన్ లోని పెషావర్ లో ఆర్మీ పాఠశాలలో మంగళవారం జరిగిన ఉగ్రవాదుల దాడిని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ముష్కమూకల కిరాతకంపై ప్రణబ్ ముఖర్జీ తీవ్రాందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి దారుణ దాడులు మానవత్వానికి విరుద్ధమని పేర్కొన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం ఏకం కావాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాదుల దాడిని మతిలేని చర్యగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఘాతుకంపై మాట్లాడేందుకు మాటలు రావడం లేదని ట్వీట్ చేశారు.
It is a senseless act of unspeakable brutality that has claimed lives of the most innocent of human beings - young children in their school.
— Narendra Modi (@narendramodi) December 16, 2014