ముఖ్యమంత్రికి మోదీ అభినందనలు
అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా గుజరాత్ ముఖ్యమంత్రి ఆనందిబెన్ పటేల్కు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. ఆమెతో పాటు టీం గుజరాత్ మొత్తాన్ని ఆయన తన ట్వీట్ ద్వారా అభినందించారు. సుపరిపాలనతో పాటు ఏడాది కాలంలో మంచి పురోగతి సాధించారంటూ ప్రశంసలతో ముంచెత్తారు. రాబోయే కాలానికి శుభాభినందనలు కూడా తెలిపారు.
అందుకు సీఎం ఆనందిబెన్ పటేల్ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఒక ట్వీట్ ఇచ్చారు. భారతదేశాన్ని 'ప్రపంచానికే గురువు' చేసేందుకు తమ శక్తివంచన లేకుండా సామర్థ్యం మేరకు కృషిచేస్తామని, ఈ దిశగా గుజరాత్ తన సేవలు అందిస్తుందని ఆమె తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నరేంద్రమోదీ.. గత సార్వత్రిక ఎన్నికల్లో పూర్తిస్థాయి మెజారిటీ సాధించి ప్రధాని అవ్వడంతో గుజరాత్ సీఎం పదవికి ఆనందిబెన్ పటేల్ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.
I congratulate Gujarat CM @anandibenpatel & entire Team Guj on completing a successful year of progress & good governance. My best wishes.
— Narendra Modi (@narendramodi) May 22, 2015
Thank you PM @narendramodi for your kind wishes. Gujarat will continue to contribute to the best of its capacity to make India 'Vishwa Guru'
— Anandiben Patel (@anandibenpatel) May 22, 2015