'ఏ ప్రతిపక్షమూ మమ్మల్ని బెదిరించలేదు'
న్యూఢిల్లీ: నల్లధనం విషయంలో ఏ ప్రతిపక్షమూ మమ్మల్ని బెదిరించలేదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. మంగళవారం రాజ్యసభలో సభ్యులనుద్దేశించి మోదీ ప్రసంగిస్తూ... చెన్నైలో మూసివేసిన ప్రముఖ సెల్ కంపెనీ నోకియా ప్లాంట్ను తిరిగి తెరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భూ సేకరణ చట్టంలోబలహీనతలపై తమ ప్రభుత్వం దృష్టి పెడుతున్నామని వివరించారు. గతంలో చట్టంలో పేర్కొన్న విధంగానే రైతులకు పరిహారం ఇస్తామని చెప్పారు.
ఆహారభద్రతా చట్టంపై ప్రతిపక్షాలు సందేహాలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. జనాభాలో 67 శాతం మంది ఆహారభద్రతా చట్టంకిందే ఉన్నారని మోదీ గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్ సీఎం ముఫ్తీ మహ్మద్ సయిద్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన చేసిన ప్రకటనలను తాను సమర్థించటం లేదని మోదీ తెలిపారు. తీవ్రవాదం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడేది లేదని మోదీ ఈ సందర్బంగా ప్రకటించారు.